telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఫలితాల నేపథ్యంలో భేటీలు : నేడు రాహుల్ .. చంద్రబాబు ..

today rahul gandhi and chandrababu meet

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడుతున్న వేళ భేటీలతో బిజీగా మారారు. చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంలో ఈసీ తీరును ఎండగట్టేందుకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన ఆయన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఫలితాల అనంతరం కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు అవసరమైన కసరత్తుపై చర్చించినట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్‌తో దాదాపు గంటన్నరపాటు జరిగిన చర్చల్లో ఇక ముందు వేయాల్సిన అడుగులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో 10 గంటలకు చంద్రబాబు సమావేశం అవుతారు. వీలైతే యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తోనూ సమావేశం అవుతారు. అనంతరం లక్నో చేరుకుని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయి ఎన్నికల తర్వాతి పరిణామాలపై చర్చిస్తారు. ఆదివారం తిరిగి ఢిల్లీ చేరుకొంటారు

Related posts