telugu navyamedia
రాశి ఫలాలు

ఈ రోజు ఈ జాతకంవారు జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu

మేష రాశి
మానసిక భయం లేదా సైకలాజికల్ ఫియర్ మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. సానుకూల దృక్పథం, మరియు వెలుగు వైపుకు చూడడం అనేవి మిమ్మల్ని సురక్షితంగా ఉంచగలవు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ ఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి సహాయ పడతాయి. రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలనీ ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి.

వృషభ రాశి
అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక, మీకు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. ఏరోజుకారోజు బ్రతకడం కోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకొండి. ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా మరియు నిదానంగా ఉండేలాగ కనిపించడం లేదు. మీ ప్రేమికురాలిని నిరాశ పరచకండి. లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు.

మిథున రాశి
మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండిబకాయిలు వసూలు చేస్తారు. లేదా క్రొత్త ప్రాజెక్ట్ ల కోసం నిధుల కోసం అడుగుతారు. కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు. కానీ బాగా డిమాండ్ చేసేలాగ ఉంటారు. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. ఎందుకంటే అలాకాకపోతే మీ లవర్ అప్సెట్ అవడానికి ఎక్కువసేపు పట్టదు. ఏవిధమైన ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి. అవసరమైతే సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు.

కటక రాశి
రక్తపోటుగల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగ చేస్తుంది. మీ ఇంటి గురించి మదుపు చెయ్యడం లాభదాయకం. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లనించి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగ మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు, అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చెయ్యడానికి పని చెయ్యండి. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు.

సింహ రాశి
ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరమవుతుంది. అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. ఏమంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు.

కన్యా రాశి
త్రాగుడు అలవాటు మానడానికి ఇవాళ చాలా శుభదినం. వైన్ త్రాగడం అనేది ఆరోగ్యానికి బద్ధ శత్రువు అని గుర్తుంచుకొండి. అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీల్లో కూడా మీరు అనుభూతి చెందగలరు. ఎందుకంటే మీ ప్రేమిక/ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి! కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని వత్తిడి ఇంకా మనసును మబ్బుక్రమ్మేలా చేస్తుంది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది.

తులా రాశి
మీ కుటుంబ సభ్యులు కొద్దిమంది, తమ శత్రువులనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు. కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు. లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. నివారణ లేనిదానిని భరించక తప్పదు అని గుర్తుంచుకొండి. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ధ్యాస పెట్టాలి. ఇంటి చుట్టూ ప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండడానికి చేపట్టబడతాయి. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్/ ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది. మీరు ఏ క్రొత్త ప్రాజెక్ట్ అంగీకరించే టప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు.

వృశ్చిక రాశి
శ్రమతో కూడిన రోజుతప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీరు పొగ త్రాగడం మానడానికి మీ శ్రీమతి ప్రోత్సాహమిస్తారు. ఇప్పుడే మిగిలిన చెడుఅలవాట్లను కూడా వదిలించుకొండి. సరైన సమయం. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట పోటు వెయ్యాలి అని గుర్తుంచుకొండి. రొమాన్స్- అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. ఆఫీసులో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు.

ధనుస్సు రాశి
మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో, మీ నిరంతర సానుకూలత ప్రశంసించ బడుతుంది. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీయొక్క సంతోషం, ఃఉషారైన శక్తి- చక్కని మూడ్- మీ సరదా మనస్త్వత్వం మీచుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. మీ మాటను అదుపుచేయడానికి ప్రయత్నించండి.మీ కఠినమైన మాటలు శాంతికి భంగంకలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీసంబంధాలను హాయిగా గడిచిపోతుంటే, దానికి ప్రమాదం తెస్తాయి. వృత్తిలో ఖచ్చితమైన చర్యలు, ఆచితూచి వేసే అడుగులు, రివార్డ్ ని పొందుతాయి. ఇది మీకు ప్రాజెక్ట్ సరిగ్గా సమయానికి పూర్తి చేయడానికి సహాయకరం అవుతుంది.క్రొత్త ప్రాజెక్ట్ లు అంగీకరించడానికి కూడా ఇదే మంచి సమయం. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగుపొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు.

మకర రాశి
ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకి కోపం తెప్పించినట్లే. కోపం మండిపోకుండా అమె అనుమతి తీసుకొండి. సులువుగా సమస్య పరిష్కారమవుతుంది. మీ రొమాంటిక్ సంబంధం ఈరోజు సఫర్ అవుతుంది. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు. కానీ, మీకు చెప్పక పోవచ్చును.- ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే, అప్పుడు, మీ వైపునుండి పరిశీలన చేసుకొండి, అది తెలివైన పని అవగలదు. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. అసలే కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు.

కుంభ రాశి
ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి. చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది. (నేర్చుకోవడానికి)స్వీయ సానుభూతి లో ఈ సమయం వృధా కాకుండా, జీవిత పాఠాలను నేర్చుకొండి. ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశిలించి మన్నించుతారు. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మీరు భాగస్వాములనుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. మీకుఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణయొక్క కిటుకు, మీసన్నిహిత వ్యక్తులు అతికొద్ది మందికే తెలుస్తుంది. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు.

మీన రాశి
మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు- మొండిబకాయిలు వసూలు చేస్తారు. లేదా క్రొత్త ప్రాజెక్ట్ లకోసం నిధులకోసం అడుగుతారు. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నదివంటిదని భావిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పని చేస్తారు. మీనిర్ణయాలు ఒకకొలిక్కితెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.

Related posts