telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

తగ్గిన పసిడి, వెండి ధరలు

Gold rates hike

ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు బంగారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే కాస్త తగ్గాయి. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 06-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు, దేశీయంగా బంగారానికి డిమాండ్, స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు.. మంగళవారం (06.10.2020) పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 480 రూపాయలు తగ్గి 48,020 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 520 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,900 రూపాయలుగా నమోదు అయింది. మరో వైపు నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. వెండి ధరలు… కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరల కంటే తగ్గాయి. ఈరోజు కేజీ వెండి ధర 60,700 రూపాయల వద్ద నమోదు అయింది. విజయవాడ, విశాఖపట్నంలలో.. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.
దేశరాజధాని ఢిల్లీలో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 430 రూపాయలు తగ్గింది. దాంతో 53,350 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే… ఈరోజు వెండి ధర కేజీకి 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 60,700 రూపాయల వద్ద నమోదు అయింది.

Related posts