telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

petrol bunk

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.75 శాతం తగ్గుదలతో 42.53 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.74 శాతం క్షీణతతో 40.30 డాలర్లకు తగ్గింది. ఇక ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దీంతో హైదరాబాద్‌‌లో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ.84.25 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.76.84 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.87.16 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.79.34 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.86.73 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.78.93 వద్ద నిలకడగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర స్థిరంగానే ఉంది. రూ.81.06 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.70.46 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.87.74 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.76.86 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

Related posts