telugu navyamedia
news political Telangana

నేడు హైదరాబాద్‌కు రానున్న సీఎం కేసీఆర్

CM KCR Phone opposition Leaders

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈరోజు హైదరబాద్‌కు రానున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కెసిఆర్‌ తొలిసారిగా ప్రధానిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై 16 వినతి పత్రాలను ప్రధానికి సమర్పించారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం వివిధ రాజకీయ పార్టీల నేతలతో కేసీఆర్‌ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఇటీవల ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. అనంతరం అక్కడ్నించి ఢిల్లీ టూర్‌కు వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీతోపాటు పలువురు నేతలను కలుసుకున్నారు. రెండు రోజుల పర్యటన పూర్తి చేసుకుని ఇవాళ తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.

Related posts

తప్పుడు సర్వే పై పోలీసుల ఆరా.. నిందితుని కోసం గాలింపు!

vimala p

కేటీఆర్‌ కు హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానం

vimala p

ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్.. పాస్ వర్డ్ లు మా ఉద్యోగులకు తెలుసు!

vimala p