telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బడ్జెట్ ప్రధానాంశాలు : నెలకు 50వేలు జీతమైన .. పన్నే లేదు..

today budget sessions imp points

నేడు కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనంతరం సోమవారానికి లోక్‌సభ వాయిదా వేశారు. ఈ బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు :

* వ్యక్తిగత పన్ను మినహాయింపు, రూ.5 లక్షల లోపు వ్యక్తిగత వార్షిక ఆదాయం కలిగిన వారికి పన్ను మినహాయింపు. దీని ద్వారా 3 కోట్ల మంది మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. 6.5 లక్షల రూపాయల గ్రాస్ ఆదాయం పొందే వారికి కూడా ఎలాంటి పన్నూ ఉండదు. అయితే వాళ్లు ఆ మేరకు గుర్తింపు పొందిన వాటిపై పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అంటే, నెలకు రూ. 50 వేల వరకు వేతనం అందుకునే వారికి టీడీఎస్‌ ఉండదు.

* బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్ల ద్వారా లభించే వడ్డీపై పన్ను పరిమితి ఇకపై 40 వేలకు పెంపు. గతంలో ఇది 10 వేలు ఉండేది.

* ఇంటి అద్దె ద్వారా లభించే ఆదాయంపై పన్ను ఉపశమనం రూ.1.8 లక్షల నుంచి రూ.2.4 లక్షలకు పెంపు.

* గృహ రుణం, విద్యా రుణం మొదలైన వాటిపైన లభిస్తున్న పన్ను రాయితీలు కూడా కొనసాగుతాయి.

* జీఎస్టీ ద్వారా పేదలకు ఎక్కువగా ప్రయోజనం చేకూరింది. పేద, మధ్య తరగతి ప్రజలు రోజువారీగా వినియోగించే చాలా వస్తువుల ధరలు 0 నుంచి 5 శాతం పన్ను పరిధిలోనే ఉన్నాయి.

* గృహ కొనుగోలుదారులకు లబ్ధి చేకూర్చే విషయంపై మంత్రుల బృందం ఆలోచిస్తోంది.

* 2019 జనవరిలో జీఎస్టీ రాబడి రూ. 1 లక్ష కోట్లు దాటింది.

* ప్రపంచంలో ఫోన్ కాల్, ఇంటర్నెట్ డేటా ఛార్జీలు అత్యంత తక్కువ ఉన్న దేశం భారత్. గత ఐదేళ్లలో డేటా వినియోగం 50 రెట్లు పెరిగింది. తద్వారా దేశంలో మొబైల్, మొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలు 2 నుంచి 268కి పెరిగాయి.

* గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా మార్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.

* ఈశాన్య రాష్ట్రాలకు కేటాయింపును రూ.58,166 కోట్లకు పెంచాలనుకుంటున్నాం.

* పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. గత అయిదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 10 రెట్లు పెరిగింది. ఈ రంగంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి.

Related posts