telugu navyamedia
crime news political

శ్రీలంకలో పేలిన మరో బాంబు

serial bomb blasts in srilanka capital 42 died

శ్రీలంకలో ఓవైపు భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు చేస్తుండగానే మరోవైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోకు సమీపంలో తూర్పు వైపున ఉన్న పుగోడా పట్టణంలో ఈరోజు మరో పేలుడు సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర మాట్లాడుతూ పుగోడాలోని కోర్టు వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మరోవైపు ఈస్టర్‌ సండేరోజు జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 359కి చేరింది. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Related posts

ఏ మాత్రం సిగ్గున్నా సీఎం రాజీనామా చేయాలి: తులసిరెడ్డి

vimala p

ఫొటో తీసి పంపితే కరెంట్ బిల్… త్వరలో డిస్కమ్ యాప్!

vimala p

ఓపెన్ డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోండి

vimala p