telugu navyamedia
andhra Telangana trending

భగ్గుమంటున్న ఎండలు .. నేడూ 48డిగ్రీలు .. నెత్తిన మొలుస్తున్న మొక్కలు..

ever high temp in andhrapradesh

నేడు కూడా వడగాడ్పుల తీవ్రత ఉత్తర తెలంగాణపై కొనసాగుతున్నది. చాలాప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ముగ్గురు ఉపాధికూలీలు ఉండగా.. పలువురు వృద్ధులు ఉన్నారు.

హైదరాబాద్‌లో ఎండల తీవ్రత కొద్దిగా తగ్గింది. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో అత్యధికంగా 46.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. జగిత్యాలలో 46, ఖమ్మంలో 45.4, రామగుండంలో 44.6, నల్లగొండలో 44.6, భద్రాచలంలో 44.5 ఆదిలాబాద్‌లో 43.8, హన్మకొండలో 43.5, నిజామాబాద్‌లో 43.5 మెదక్‌లో 43 డిగ్రీలు నమోదైంది. గాలిలో తేమశాతం బాగా తగ్గడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. దీనికారణంగా వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయని అధికారులు తెలిపారు.

tempనిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాచలం, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎండల తీవ్రత కొనసాగుతున్నా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్పల్పంగా తగ్గాయి. గురువారం 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు కాగా, శుక్రవారం 42.8 డిగ్రీలుగా నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయిందని తెలిపింది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా ఇదే పరిస్థితి. ప్రజలను అధికారులు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితులలో వచ్చినా, తగిన జాగర్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

trees on hair tempనెత్తిపై టోపీ, చేతిలో నీళ్ల బాటిల్ తదితర ముందుజాగర్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. నిన్న ఒక్కరోజే వడగాల్పులకు తెలుగురాష్ట్రాలలో 25మందిపైనే మృత్యువాత పడ్డారు. అందుకే తెల్లవారు జామున, లేక చీకటి పడిన తరువాత మాత్రమే బయటకు వచ్చి, కనీస అవసరాలు తీర్చుకోవాలని, నడి ఎండలో బయటకు వస్తే, నిండు ప్రాణాలకు ముప్పు అని హెచ్చరిస్తున్నారు. ఎండను తప్పించుకోడానికి ప్రజలు కూడా విచిత్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెత్తిన చెట్టు కొమ్మలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు.. ప్రజల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నారు. కనీసం గొడుగు తీసుకెళ్లండి.

Related posts

చంద్రబాబు దోపిడీని చూడలేకే టీడీపీని వీడా: ఎమ్మెల్యే మేడా

ashok

టీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..

vimala p

విపక్ష నేతలు గులాబీ గూటికి బారులు: జగదీష్ రెడ్డి

vimala p