• Home
  • Trending Today
  • 33.5 కేజీల అండాశయ క్యాన్సర్ కణతిని తొలగించిన వైద్యులు… గిన్నిస్ వరల్డ్ రికార్డ్
Trending Today ఆరోగ్య వార్తలు వార్తలు సామాజిక

33.5 కేజీల అండాశయ క్యాన్సర్ కణతిని తొలగించిన వైద్యులు… గిన్నిస్ వరల్డ్ రికార్డ్

TN Doctors Removed the 33.5 Kgs Tumor from Woman's Stomach

తమిళనాడు: కోయంబత్తూరు ఆసుపత్రి వైద్యులు ఓ మహిళ కడుపులోంచి ఏకంగా 33.5 కేజీల అండాశయ కణితిని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించి రికార్డును సృష్టించారు… ఊటి ప్రాంతానికి చెందిన రోజువారి వ్యవసాయ కూలీ వసంత పొత్తికడుపు రోజురోజుకు పెరుగుతూ పోతుండటం విపరీతమైన కడుపునొప్పి తలెత్తడంతో స్థానిక వైద్యులను సంప్రదించగా వైద్యులు అవసరమైన పరీక్షలను నిర్వహించి అండాశయ కణితిగా తేల్చారు… అయితే ఆమె స్థితిలో వైద్యం చేయలేమని తెలపడంతో నొప్పి తీవ్రమౌతూ నడవలేకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోలేకపోవడం ఆఖరికి శ్వాస తీసుకోవడంలో సైతం ఇబ్బందులను బాధిత మహిళ

కోయంబత్తూరులో గల ఓ ఆసుపత్రి గురించి తెలిసి అక్కడి వైద్యులను సంప్రదించగా అత్యవసర చర్యలు చేపట్టి సుమారు మూడు గంటలుపాటు శ్రమించిన వైద్య బృందం కణితిని విజయవంతంగా తొలగించింది. కణితి బరువు ఏకంగా 33.5 కేజీలుగా ఉంది. కాగా ఆ కణతిని ల్యాబ్ కి పంపించగా అండాశయ కేన్సర్ అని నిర్ధారణ అయింది దీనితో ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద అండాశయ క్యాన్సర్ కు చికిత్స చేసినట్లుగా వైద్యులు రికార్డు క్రియేట్ చేశారు. ఈ తాజా శస్త్రచికిత్సకు ఇప్పటికే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆమోదం లభించింది. అదేవిధంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కు , ఈ రికార్డ్ ను పంపనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

Related posts

పాక్ జర్నలిస్టుకు సానియా మీర్జా కౌంటర్!

madhu

సర్వేల ప్రకారం పరిస్థితి బాగుంది.. అన్ని స్థానాల్లో గెలుస్తాం : కేసీఆర్

madhu

శబరిమల అయ్యప్ప దర్శనానికి.. ఇక మహిళలు కూడా : సుప్రీంకోర్టు

chandra sekkhar

Leave a Comment