telugu navyamedia
news political Telangana

ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుంది: కోదండరామ్

kodandaram protest on inter students suicide

తెలంగాణలో ఐదు రోజులుగా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర బంద్ పై రేపు మధ్యాహ్నం ఓ ప్రకటన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మె గా మారుతుందని హెచ్చరించారు. సమ్మెపై గవర్నర్ తమిళిసైని కలిసి ఓ వినతిపత్రం అందజేయాలని అఖిలపక్షాల నేతలు నిర్ణయించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర జరుగుతోందని, దీన్ని అన్ని పార్టీలు అడ్డుకోవాలని కోరారు.

Related posts

వరండాలో అనకొండ… కళ్లెదుటే ఉన్నా రెండ్రోజులు పట్టుకోలేకపోయారు…!!

vimala p

నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ

vimala p

టీటీడీ ఆధ్వర్యంలో ‘శుభప్రదం’ శిక్షణ

vimala p