తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

మహాకూటమి సీట్ల పంపకాలను తేల్చేయాలి: కోదండరామ్

TJS Kodanda Ram comments alliance seats

తెలంగాణలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘ముందస్తు’ షెడ్యూలతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు ప్రారంభించాయి. మహాకూటమిలో సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు ఎటూ తేల్చకపోవడంపై టీజేఎస్ అధినేత కోదండరామ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మహాకూటమి సమావేశాలు చాయి తాగి పోయేందుకే పరిమితమవుతున్నాయని అన్నారు.

సీట్ల పంపకాలపై త్వరగా తేల్చి, ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కోరారు. ఆలస్యం చేస్తే సాగదీస్తూ పోతే పరిస్థితులు బలహీనపడతాయని చెప్పారు. ఉమ్మడి అజెండాను ప్రకటిస్తే,   ప్రజల్లో చర్చ పెట్టే అవకాశం లభిస్తుందని తెలిపారు. పొత్తులను సీట్ల కోణంలో చూడరాదని చెప్పారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం సీట్ల పంపకాలను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. 

Related posts

పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది: జేసీ

madhu

కాంగ్రెస్ లో చేరిన గద్దర్ కొడుకు…

admin

తెలంగాణలో మరో బస్సు బోల్తా … తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

jithu j

Leave a Comment