• Home
  • వార్తలు
  • తితలీ తుఫాను పెను బీభత్సం.. శ్రీకాకుళంలో ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు వార్తలు

తితలీ తుఫాను పెను బీభత్సం.. శ్రీకాకుళంలో ఇద్దరు మృతి

Titli cyclone, srikakulam, AP

ఈరోజు తెల్లవారుజామున తితలీ తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం విశాఖ జిల్లాపైనా పడింది. ఈశాన్య దిశగా కదిలి తుపానుగా రేపటికి బలహీనపడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళంలో గంటకు 135-145 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరో 6 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో తితలీ తుపాను పెను బీభత్సం సృష్టిస్తోంది. బలమైన గాలులు వీచడంతో చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. తుఫాను ధాటికి జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వంగర మండలం ఓనిఅగ్రహారంలో చెట్టు విరిగిపడి అప్పలనరసమ్మ(62) మృతి చెందగా, సరుబుజ్జిలి మండలంలో ఇల్లు కూలి సూర్యారావు(55) మృతి చెందాడు.

తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలోని చాలా చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విద్యుత్‌, కమ్యూనికేషన్‌, రైల్వేలైన్లకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాను నేపథ్యంలో కళింగపట్నంలో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Related posts

స్కామ్ లో బలైన జైలర్… టోకరా కొట్టి

nagaraj chanti

ఐటీ దాడులు మాఇంట్లో కాదు.. బంధువుల ఇంట్లో అంటున్న రేవంత్ రెడ్డి…

chandra sekkhar

ఎల్.ఈ.డి వీధి దీపాలలో..ఏపీ అగ్రస్థానం.. కేంద్ర నివేదిక…

chandra sekkhar

Leave a Comment