• Home
  • వార్తలు
  • హుద్ హుద్ కంటే తితలీ భయానకంగా ఉంది… : రవాణా మంత్రి
రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

హుద్ హుద్ కంటే తితలీ భయానకంగా ఉంది… : రవాణా మంత్రి

titali is more dangerous than hud hud said minister

ఆంధ్రప్రదేశ్ లో ని ఉత్తర కోస్తా లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాను తితలీ తుఫాన్ వణికిస్తుంది. నేడు ఉదయం తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటించిన రవాణా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గతంలో విశాఖలో సంభవించిన హుద్ హుద్ కంటే ఈ తుఫానే భయానకంగా ఉందని, కానీ నాటి అనుభవాల నేపథ్యంలో అధికారులు ముందు జాగర్త చర్యలు తీసుకోవటంతో ప్రాణనష్టం అయితే తప్పిందని అన్నారు.

ముందు జాగర్త చర్యల వలన ప్రాణనష్టం జరగలేదు కానీ, ఆస్తినష్టం అయితే భారీగానే సంభవించిందని చెప్పారు. వేలాది చెట్లు నేలకు ఒరిగాయి. ప్రకృతి విపత్తును ఆపలేము కానీ ప్రభుత్వం తరుపున సరైన చర్యలు తీసుకోని నష్టాన్ని కొంతమేరకు నివారించగలిగామని అచ్చెన్నాయుడు చెప్పారు. జిల్లాలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయ్యిందని, అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు మంచి నీరు, ఆహారాన్ని అందిస్తున్నామని, వర్షం తగ్గకపోయినా సహాయక చర్యలు కొనసాగుతాయని వారు చెప్పారు. ఎవరికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అధికారులు ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయవచ్చని సూచించారు.

Related posts

శ్రీలంకలో కూడా ఆమెకు ఆర్మీ ఉందంట!

jithu j

రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…పనులు ముమ్మరం చేసిన ప్రభుత్వం…

chandra sekkhar

జీవితాన్ని ఫాజిటివ్ గా చూసిన వ్యక్తి నరస రాజు

admin

Leave a Comment