Trending Today రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

బాబుపై తితలీ తుఫాన్ ప్రభావం…రాత్రంతా జాగారం…రాష్ట్రానికి మోడీ సాయం..

titali effect on chandrababu

ఉత్తరాంధ్రను వణికిస్తున్న తితలీ తుఫాన్ ఫై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. ఆ అధికారులతో పాటు ఏపీసీఎం చంద్రబాబు కూడా రాత్రి అంతా మెలుకువగానే ఉంది మరి పరిస్థితులను సమీక్షిస్తూ, తగిన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారట. ప్రతి క్షణం అధికారులను అప్రమత్తం చేస్తూ, ప్రాణ, ఆస్తినష్టాలను తగ్గించేందుకు బాబు కీలక పాత్ర పోషించాలని అధికారులకు సూచించారు. సీఎం స్థాయివారు రాత్రి పగలు తేడాలేకుండా పనిచేస్తుంటే అధికారులు కూడా మరింత ఉత్సాహంతో పరిస్థితులను చక్కబెట్టే పనిలో చురుకుగా పని చేశారు. ఎట్టి పరిస్థితులలోను ప్రాణ, ఆస్తి నష్టం జాగరకుండా చూడాలని బాబు అధికారులను ఆదేశించారు.

ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు కూడా రాత్రంతా చురుగ్గా పనిచేసి చాలావరకు ఆస్తి నష్టం నివారించగలిగారు. కలెక్టర్ స్థాయి నుండి ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని చెప్పాలి. ఇక మరోవైపు విపత్తు నిర్వహణ, వాతావరణ, జలవనరుల శాఖలు అందించే సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఆయా చర్యలను తీసుకున్నారు అధికారులు. తీవ్రంగా ప్రభావం చూపిన ప్రాంతాలనుండి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు, అలాగే వారికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని బాబు ఆదేశించారు. నేడు ఉదయం 10:30 నిముషాలకు మరోసారి పరిస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

కాగా ఈ తుపానుపై ప్రధాని మోడీ బాబుతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ తుఫాన్ ప్రభావం ఒడిశా పైకూడా ఉండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మోడీ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని పరిస్థితులలోను రాష్ట్రాలకు అందగా ఉంటామని మోడీ ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చారు. కేంద్రం నుండి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

బాధిత ప్రాంతాలలో పర్యటించిన బాబు జిల్లా వాసులను పరామర్శించారు. అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ తుఫాను వలన శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గరు మృతి చెందారు.

Related posts

రగులుతున్న రాఫెల్.. రిలయన్స్‌ ఎంపిక భారత్‌: ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు

madhu

పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ యనమల

madhu

కాంగ్రెస్‌ నేతలను తరిమి కొట్టాలి: కేటీఆర్‌

madhu

Leave a Comment