telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

శ్రీవారి దర్శనానికి.. 8 నుంచి ట్రయల్ రన్!

ttd plans to venkanna temples in mumbai and j & K

లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ 8వ తేదీ తరువాత ప్రార్థనాలయాలు తెరచుకునేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ఏ క్షణమైనా తిరుమలలో దర్శనాలు ప్రారంభం కానున్నాయి. పలు ఆంక్షల మధ్య స్వామిని కనులారా దర్శించుకునే సమయం దగ్గరలో ఉంది. ఇందుకోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ భౌతిక దూరం పాటించడంతో పాటు వారి కోసం శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నారు.

భక్తుల సంఖ్యను తగ్గించడంపై అధికారులు దృష్టిని సారించారు. ఈ మేరకు భక్తుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు ప్రారంభించారు.రోజుకు దాదాపు 85 నుంచి 95 వేల మందికి దర్శనాన్ని ఇచ్చే దేవదేవుడు ఇకపై గరిష్ఠంగా 10 నుంచి 15 వేల మందికి మాత్రమే కనిపించనున్నాడు. తొలి దశలో 7 వేల మందికి, ఆపై దశలవారీగా ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక విధివిధానాలను టీటీడీ ఇప్పటికే సిద్ధం చేసింది.

సర్వదర్శనం విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ, ఆన్ లైన్, టైమ్ స్లాట్ టోకెన్, దివ్య దర్శనం విధానాలను మాత్రమే కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ లో దర్శన స్లాట్లను బుక్ చేసుకునే భక్తులకు దర్శన సమయానికి కొన్ని గంటల ముందుగా మాత్రమే కొండపైకి అనుమతి లభించనుంది. టీటీడీ ఉద్యోగులు, తిరుమలలో నివసిస్తున్న స్థానికులకు తొలి మూడు, నాలుగు రోజుల్లో దర్శనం కల్పించాలని టీటీడీ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీరితో ట్రయల్ దర్శనాలు నిర్వహించి, ఆపై సాధారణ భక్తులను అనుమతించాలన్నది టీటీడీ భావిస్తోంది.

Related posts