telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

tirumala temple

టీటీడీ పాలకమండలి బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ అంటే తిరుమల మాత్రమే కాదని, తిరుమల-తిరుపతి కలిసి ఉంటాయని స్పష్టం చేసింది. దాంతోపాటు కల్యాణకట్ట కార్మికులు, ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసేందుకు బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. శ్రీవారి బ్రహ్మోహ్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు, ఉద్యోగులకు పాలకమండలి ధన్యవాదాలు తెలిపింది.

గరుడ వారధి ఎక్కువ భక్తులకు ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో.. దాని నిర్మాణ ప్లాన్‌ను రీ డిజైన్ చేయాలని బోర్డు తీర్మానించింది. రీ టెండర్లు పిలవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇక స్వీమ్స్ ఆసుపత్రిని అధీనంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయ్యాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీ అటవీశాఖలో 162 మంది సిబ్బంది ని రెగ్యులర్ చేసి, మిగిలిన వారికి టైమ్ స్కేల్ ఇవ్వాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో కూడా పూర్తిస్థాయిలో మద్యపాన నిషేదం విధించాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు పాలకమండలి వెల్లడించింది.

Related posts