telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

తిరుమలలో విజిలెన్స్ దాడులు.. సిఫార్సు టికెట్లు విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్!

tirumala temple

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దళారుల చేతుల్లోచిక్కి మోసపోకుండా ఉండేందుకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో సిఫార్సు లేఖలపై టికెట్లను పొంది అధిక ధరలకు విక్రయిస్తున్నా బ్రోకర్లు పట్టుబడ్డారు. తాజాగా, స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధి సిఫార్సు లేఖపై చైర్మన్ ఆఫీసులో 18 బ్రేక్ దర్శనం టికెట్లను పొందిన ప్రసాద్ అనే వ్యక్తి, వాటిని అధిక ధరలకు విక్రయించి చిక్కాడు. ప్రసాద్ తో పాటు వెంకట రమణ, శ్రీనివాసులు, ప్రేమ్ కుమార్, వాసు అనే వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

వీరంతా వివిధ సిఫార్సు లేఖలపై టికెట్లను పొంది, వాటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నవారేనని తేలిందని చెప్పారు. కాగా, గడచిన వారం వ్యవధిలో తిరుమలలో పట్టుబడిన దళారుల సంఖ్య 20కి చేరింది. దర్శనాలు, అద్దె గదుల విషయంలో భక్తులను మోసగిస్తున్న వీరు, నిత్యమూ లక్షల్లో దండుకుంటున్నట్టు విచారణలో వెల్లడైంది. కాగా అరెస్ట్ అయిన వారిలో ప్రసాద్ ను విడిచి పెట్టాలని రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం.

 

Related posts