telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

కరోనాతో తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి

TTD

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందారు. గత కొద్దీ రోజుల క్రితం దీక్షితులు కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసమూర్తి దీక్షితులు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 30 ఏళ్లకు పైగా కొనసాగిన శ్రీనివాసమూర్తి దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది.

Related posts