telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

బరువు పెరగడానికి .. బ్రహ్మాండమైన చిట్కా..

tips to weight gain in just 10 days

అధిక బరువుతో బాధపడేవారేకాదు, సరైన పోషక విలువలు అందక తక్కువ బరువుతో సన్నగా ఉన్నందుకు బాధపడేవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. శరీర బరువు పెంచుకోవడానికి తగిన ఆహార పద్ధతులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీ శరీర రకాన్ని బట్టి మీరు ఏమి తీసుకోవాలో నిర్ణయించబడుతుంది. త్వరగా బరువు పెరగాలనుకునే వారు, దాదాపు 10 రోజుల్లో పెరగాలనుకునే వారు కొన్ని పద్ధతులు పాటిస్తే మంచిది.

* ఇది మీకు ఖచ్చితంగా ఒక సవాలులాంటిది. నిష్టతో ఆచరిస్తే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. పోషకాలు, క్యాలరీలు ఎక్కువగా కలిగి ఉండే ఆహారాలు, సాచురేటేడ్ కొవ్వు, చక్కెరలు తక్కువగా గల ఆహార పదార్థాలు తీసుకోవాలి. మీగడ తీసిన పాలు, నట్స్, నట్స్ బటర్, హోల్ గ్రైన్స్, బంగాళదుంప వంటి పిండి పదార్థాలు గల కూరగాయలు, అరటిపండు, వీటితోపాటు అధిక క్యాలరీలను మరియు పోషకాలను కలిగి ఉండే బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి.

tips to weight gain in just 10 days* పది రోజులలో శరీర బరువు పెరగాలి అనుకుంటే, రోజు తినే ఆహార ప్రణాళికలో కనీసం ‘500 క్యాలరీల’ను అధికంగా కలుపుకోవాలి. తీసుకునే భోజన పరిమాణాన్ని పెంచండి లేదా రెట్టింపు చేస్తే మరీ మంచిది. తినే ఆహారం క్యాలరీలు అధికంగా ఉండేవి అయ్యుండాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి తినాలి. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్‌లు సమృద్ధిగా గల ఆహారాన్ని తీసుకోవాలి.

* ముఖ్యంగా పడుకునే ముందు అధిక క్యాలరీలు గల పదార్ధాలను తినడం వలన కూడా బరువు పెరగవచ్చు. సహజ పండ్ల రసాలను, తేనె, కొవ్వు తక్కువగా గల పాలు, ప్రొటీన్ షేక్స్, శక్తిని అందించే ద్రావణాలు వంటి వాటిని కూడా తాగాలి.

* చక్కెర గల టీలు, చక్కెరలు గల మిల్క్ షేక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. భుజాలపై ఒత్తిడి పెంచే వ్యాయామాలు, స్క్వాట్స్, డిప్స్, లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్ మొదలుగునవి రోజు అనుసరించటం వలన శరీర బరువు పెరగటంలో సహాయపడతాయని చెప్పవచ్చు.

Related posts