telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కంటి ఆరోగ్యానికి.. ఇంటి చిట్కాలు.. !

tips to take care of eyes in summera

సర్వేంద్రియానాం నయనం ప్రదానం .. వాటి ఆరోగ్యానికి తగిన జాగర్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ వేసవిలో త్వరగా కళ్ళు అలసిపోయి, పొడిబారుతుంటాయి. ఇక పెద్దల విషయం చెప్పనక్కరలేదు. ద్రుష్టి దోషాలు, శుక్లాలు లాంటి అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. ఆయుర్వేద రీత్యా వాతదోషం ప్రకోపించడం వలన కంటిపొరలు ఏర్పడుతుంటాయి. ఈ వాత దోషం కంటిని పొడిబారినట్టు చేసి పారదర్శకత లోపించేట్టు చేయడం వలన కంట్లో పొరలు ఏర్పడి దృష్టిలోపం కలుగుతుంది. ఈ లోపం సరిచేయడానికి వాత దోష ప్రకోపాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. ఈ కంటి పొరలను ప్రత్యేకించి కొన్ని మూలికలతో కలిపి పిండి తయారు చేసిన ఆవు నెయ్యిని వాడడమే మంచిది.

* 2 స్పూన్ల నెయ్యికి కొద్దిగా త్రిఫలచూర్ణం కలిపి రాత్రి నానబెట్టి ఉదయాన్నే వడబోసి సగం తాగి మిగిలిన నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా చేయడం వలన రోగికి కంటి చూపు మెరుగవుతుంది.

* ఆవు పాలతో కొద్దిగా తెల్ల గలిజేరు వేరును ఆవునేతిలో మెత్తగా నూరి కంటికి పెడితే పొరలు కరుగుతాయి. ఇంకా చెప్పాలంటే.. బియ్యాన్ని నీటిలో మెత్తగా నూరి పెడితే కూడా అతిగా వ్యాపించే కంటి శుక్లాలు త్వరగా తగ్గిపోతాయి.

tips to take care of eyes in summera* పొద్దు తిరుగుడు చెట్టు గింజల చూర్ణాన్ని రోజుకు మూడు వేళ్లకు పట్టించి 21 రోజుల పాటు నీటితో వాడితే కంటి పొరలు తగ్గుముఖం పడుతాయి. కంటి సమస్య ఉన్నప్పుడు ముందుగా ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించాకే.. వారి సలహా మేరకు అనుసరించడం మంచిది.

* తానికాయలోని గింజలను పాలలో అరగదీసి కంటికి పెడుతుంటే కంటి పొరలు తగ్గి దృష్టి మెరుగుపడుతుంది. ఆముదం గింజలోని రసాన్ని గుడ్డలో వడగట్టి 2 చుక్కల చొప్పున రెండు కళ్లల్లో ఉదయాన్నే వేస్తుంటే కంటి సమస్యలు తొలగిపోతాయి.

* పొడపత్రి గింజలను కలబంద గుజ్జులో 10 రోజులు నానబెట్టి నీడన ఎండించి ఒక గింజను నీళ్లతో అరగదీసి కంటికి కందిగింజంత పెడుతుంటే అవి కంటిపొరలను కోసి మంచి దృష్టినిస్తాయి.

Related posts