telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వడదెబ్బ తగలకుండా.. ఈ జాగర్తలు పాటించాలి.. !

tips to overcome sun strokea

ఎండాకాలం వచ్చేసింది.. ఈ కాలంలో వడదెబ్బ తగలడం చాలా సహజం. ఇది వికటించినా .. మృత్యువాత పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ వేసవిలో ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. టిప్స్ పాటించాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. జీన్స్‌ లాంటి మందంగా, బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం మానేయాలి.

ఎండలో వెళ్లిన ప్రతిసారీ తలకు టోపీ తప్పనిసరి. హెల్మెట్‌ పెట్టుకునే వాళ్లు ముందు నీళ్లతో తడిపిన రుమాలు తలకు, ముఖానికి కట్టుకుని తర్వాత హెల్మెట్‌ పెట్టుకోవాలి.

tips to overcome sun strokeaఎండలో పని చేసేవాళ్లు గంటకు లీటరు చొప్పున నీరు తాగాలి. ఇంటి పట్టున ఉండే వారు రోజుకి 4 లీటర్ల నీరు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సహజంగా నీరు ఉండే పుచ్చ, ద్రాక్ష, దోసకాయలను తినాలి. చెమట ద్వారా కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేయడం కోసం ఎలక్ట్రోల్, కొబ్బరి నీరు తాగాలి. ఉప్పు, పంచదార కలిపిన నీరు కూడా మేలు చేస్తుంది.

ఎండలో ఎక్కువ సమయం ప్రయాణం చేయవలసివస్తే రెండు గంటలకోసారి ఆగి, నీడ పట్టున విశ్రాంతి తీసుకోవాలి.

watermelon uses for health in summerవేడి వాతావరణానికి గురైనా ఎండదెబ్బ తగులుతుంది. వంటగదిలో పొయ్యి దగ్గర ఎక్కువ సమయం గడిపే స్త్రీ‌లు, కొలిమి దగ్గర పనిచేసేవాళ్లు, రేకుల ఇంట్లో నివసించేవాళ్లు, వేడి గాలికి గురయ్యేవాళ్లకు కూడా ఎండ దెబ్బ తగులుతుంది. విపరీతంగా వ్యాయామం చేసేవాళ్లు కూడా వేసవిలో ఎండదెబ్బకు గురవుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Related posts