telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఒత్తిడే అన్నిటికి కారణం.. దాని నుండి విముక్తి ఇలా..

tips to overcome stress to make healthy

ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం చాలా మందికి అలవాటు. దానివలన మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఇలా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి, దానితో పని ప్రారంభం ఆలస్యం అవుతుంది, అది పని ఒత్తిడి.. ఇలా మొత్తానికి ఒత్తిడే జీవితం అవుతుంది. అది అప్పటికి సాధారణం గా అనిపించినా, దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఈ ఒత్తిడి తగ్గించుకోడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనం ముందు ఏపని ప్రారంబించడానికైనా తీవ్రంగా ఆలోచిస్తున్నామా.. లేక సరైన ఆలోచన చేస్తున్నామా అనేదానిపై సమీక్షించుకోవాలి. దానితో కాస్త ఒత్తిడి నుండి ఉపశమనం దొరికినట్టే. ఇక ఆహారం విషయంలో కూడా కాస్త జాగర్తగా ఉంటె, పూర్తిగా ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత చాలా అవసరం. అయితే ప్రకృతిలో లభించే కొన్ని రకాల పదార్దాలను మన ఆహారంలో బాగంగా చేర్చుకోవడం వల్ల ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

* కమలాపండు…. ఇది విటమిన్ ‘సి’ని పుష్కలంగా కలిగి ఉంది. కమలాపండు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. కార్టిసోల్ హార్మోన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం పూట ఒక్క పండు తినటం వలన మంచి ఫలితం ఉంటుంది.

* బాదం… ఇవి శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది ఒత్తిడి, వ్యాకులతకు కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది.

* నేరేడుపళ్లు…. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లూ, పైటో న్యూట్రియంట్లూ ఎక్కువ మెుత్తంలో ఉంటాయి. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి.

* పాలు… వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ, బి2, బి12 విటమిన్లు, మాంసకృత్తులూ, క్యాల్షియం ఎక్కువ మెుత్తంలో ఉంటాయి. పాలలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక ప్రతి రోజూ గ్లాసుడు పాలు తప్పనిసరిగా త్రాగటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

* చేపలు… వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి వారంలో రెండుసార్లు చేపలను తినటం వలన మంచి ఫలితం ఉంటుంది.

Related posts