telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

పొట్టదగ్గర కొవ్వుకు..చెక్ పెట్టెయ్ ఇలా…

tips to overcome issue of fats at stomach

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు స‌మ‌స్య‌తో చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ది. దీనివ‌ల్ల హైబీపీ, డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అలాగే కిడ్నీలు, లివ‌ర్ డ్యామేజ్ అవుతున్నాయి. అందువ‌ల్ల పొట్ట ద‌గ్గరి కొవ్వును త‌గ్గించుకోవ‌డం ఆవ‌శ్య‌క‌మ‌వుతున్న‌ది. అయితే ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు కింద సూచించిన ప‌లు చిట్కాలను పాటిస్తే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవ‌డం పెద్ద స‌మ‌స్యేమీ కాదని నిపుణులు అంటున్నారు. ఆ చిట్కాలు ఏమిటో చూద్దామా..

1. పొట్ట ద‌గ్గరి కొవ్వును క‌రిగించ‌డంలో ఫైబ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫైబ‌ర్ అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే శరీరంలో అద‌న‌పు క్యాల‌రీలు చేర‌కుండా ఉంటాయి. దీంతోపాటు ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు క‌రుగుతుంది. అందువ‌ల్ల సహజసిద్ధంగా ఫైబ‌ర్ ఉన్న ఆహారాల‌ను డైలీ మెనూలో చేర్చుకోవాలి.

2. ఆల్క‌హాల్ అధికంగా సేవిస్తే కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. క‌నుక మ‌ద్యపానంక్రమేపి తగ్గిస్తే చాలా మంచిది. దీనితో కొవ్వు నిల్వ‌ల‌ను కరిగించ‌వ‌చ్చు.

3. చ‌క్కెర‌ ఎక్కువ‌గా ఉండే బేక‌రీ ప‌దార్థాలు, స్వీట్ల‌ను త‌గ్గించాలి. అలాగే అన్నంకు బ‌దులుగా ముడిబియ్యం, గోధుమ‌లు, తృణ ధాన్యాల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా క‌రిగించ‌వ‌చ్చు.

4. ఎరోబిక్స్‌, జుంబా, వెయిట్ ట్రెయినింగ్‌, కార్డియో వంటి వ్యాయామాల‌ను నిత్యం చేస్తుంటే కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది.

5. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల కొవ్వు క‌రుగుతుంది. అలాగే వంట నూనె ఎంపిక విష‌యంలోనూ జాగ్ర‌త్త వ‌హించాలి. ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డంతో పాటు నిత్యం త‌గినంత స‌మ‌యం పాటు నిద్ర‌పోతే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా క‌రిగించవ‌చ్చు. ఇవన్నీ చాలా సులభం అయినవే, పాటించాడని, ఆరోగ్యంగా ఉండండి. తోటివారిని ఆరోగ్యంగా ఉంచండి. 

Related posts