telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

గ్యాస్ ట్రబుల్ సమస్యా .. దీనితో సరి..!

tips to overcome gas trouble

గ్యాస్ ట్రబుల్ వ‌స్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. క‌డుపు ఉబ్బ‌రం, ఛాతి నొప్పి, గ్యాస్ వ‌స్తుండ‌డం.. త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. అయితే గ్యాస్ స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, పేగుల్లో స‌మ‌స్య‌, మ‌ధుమేహం, అల్స‌ర్లు ఉండ‌డం, స‌రైన వేళ‌కు ఆహారం తీసుకోక‌పోవ‌డం, ఉప‌వాసం మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌డం, మ‌ద్యం సేవించ‌డం, ధూమ‌పానం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంది. అయితే కింద తెలిపిన ప‌లు ఇంటి చిట్కాల‌తో గ్యాస్ స‌మ‌స్య నుంచి చాలా సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* భోజ‌నం చేసిన త‌రువాత 2 టీస్పూన్ల వాములో కొద్దిగా ఉప్పు క‌లిపి తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

* ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని జీల‌క‌ర్ర లేదా వాము 4 టీస్పూన్లు వేసి నీటిని బాగా మ‌రిగించాలి. అనంత‌రం నీటిని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉంగానే తాగేయాలి. ఇది కూడా గ్యాస్ స‌మస్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

* ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తాగినా గ్యాస్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

* ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మ‌రిగించాలి. నీరు బాగా మ‌రిగాక వ‌డ‌క‌ట్టి అందులో 1 టీస్పూన్ తేనె క‌లిపి వేడిగా ఉండ‌గానే తాగితే గ్యాస్ త‌గ్గుతుంది.

* గ్లాసు గోరు వెచ్చ‌ని పాల‌లో దాల్చిన చెక్క పొడి, తేనెల‌ను 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా క‌లిపి తాగితే గ్యాస్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు.

* ఈ సమస్యకు చిన్న చిన్న యోగాసనాలు కూడా ఉన్నాయి. వాటిని పొరగడుపున రోజు చేస్తే కూడా సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరికినట్టే. ఈ ఆసనాలు ప్రాధమికంగా గురుముఖంగా నేర్చుకొని, అనంతరం మీరే ఇంట్లో రోజు పాటించవచ్చు.

Related posts