telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అతి త్వరగా .. బరువు తగ్గేందుకు .. ఈ ఒక్కటి చేస్తే సరి.. !

నేటి పరిస్థితులలో తగిన జాగర్తలు తీసుకోకపోవడంతో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య, అధికబరువు. ఈ సమస్యను అధిగమించడానికి వాళ్ళు చేయని ప్రయత్నం ఉండదు. మార్కెట్‌లో కూడా మ‌న‌కు అనేక ర‌కాల టీలు ల‌భిస్తున్న విష‌యం విదిత‌మే. ప్ర‌తి ఒక్క టీ మ‌న‌కు ఏదో ఒక ర‌క‌మైన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాన్ని అందిస్తుంది. అయితే అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన టీల‌లో ఊలాంగ్ టీ కూడా ఒక‌టి. ఇది నిజానికి చైనీయుల సాంప్ర‌దాయ టీ వెరైటీ. ఎంతో పురాత‌న కాలం నుంచి చైనీయులు ఊలాంగ్ టీని సేవిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌న‌కు కూడా ఈ టీ మార్కెట్‌లో ల‌భిస్తున్న‌ది. ఈ క్రమంలోనే నిత్యం ఊలాంగ్ టీ తాగితే మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసుకుందాం..( ఇప్పటి వరకు వస్తువులు చైనావి, ఇప్పుడు టీ కూడానా .. అనుకోకుండా ప్రయత్నించి చూడండి)!

* ఊలాంగ్ టీ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఊలాంగ్ టీ తాగితే మ‌న శ‌రీరంలో కొవ్వు క‌రిగే రేటు 12 శాతం వ‌ర‌కు పెరుగుతుంద‌ట‌. దీంతో కొవ్వు త్వ‌ర‌గా క‌రిగి బ‌రువు వేగంగా త‌గ్గుతార‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక ఊలాంగ్ టీని నిత్యం తాగితే అధిక బ‌రువును ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు.

tips to loose weight very fast* ఊలాంగ్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం మ‌నం తినే ఆహారంలో ఉండే కొవ్వును శోషించుకోవ‌డం మానేస్తుంది. దీంతో శ‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.

* శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు నిత్యం ఊలాంగ్ టీని తాగితే ఫ‌లితం ఉంటుంది.

* డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఊలాంగ్ టీ తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

* నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న ఎదుర్కొనే వారు ఊలాంగ్ టీ తాగితే మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. రిలాక్స్ అవుతారు.

Related posts