telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

చ‌ర్మంపై ముడ‌త‌లా.. దీనితో సరి..

tips to get smooth skin all time

సాధారణంగా వయసు పై పడేకొద్దీ చర్మం పటుత్వం కోల్పోయి, ముడతపు పడుతుంది. దీనితో కొందరు అసౌకర్యంగా భావిస్తుంటారు. యుక్త వయసులోనే కొందరు ఈ సమస్యను ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అయితే దీనికి ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. ఈ సమస్యల కోసం, ఇంటి చిట్కాలు..కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో ఎవ‌రైనా స‌రే.. చ‌ర్మంపై ప‌డే ముడ‌త‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఆ సూచ‌న‌లు ఏమిటో తెలుసుకుందామా..!

* ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుని తడుచుకున్న తర్వాత నాలుగు చుక్కల నిమ్మరసం ముఖానికి రాసి అరగంట ఆగి ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. 15 నుండి 20 రోజులు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది.

* ఆలివ్‌ ఆయిల్‌ ని ముఖం మీద నెమ్మదిగా మర్ద‌నా చేయాలి. దీని వ‌ల్ల చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌డం త‌గ్గుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

* చల్లటి నీళ్ళతో ముఖం క‌డుక్కున్నప్పుడు వెంటనే టవల్‌తో తడుచుకోకుండా అలాగే ఆరనిస్తే చర్మం కొంత మేర తేమను పీల్చుకుంటుంది. తద్వారా చర్మానికి తాజాదనం ల‌భిస్తుంది.

* క్యారట్‌ రసం నిత్యం తాగితే చ‌ర్మం మీద ముడ‌త‌లు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.

* బాగా పండిన బొప్పాయి గుజ్జును మెడ, ముఖం మీద రుద్దుకుంటే చర్మానికి మంచి రంగు వ‌స్తుంది. చ‌ర్మం మీద ఉండే ముడ‌త‌లు త‌గ్గుతాయి.

* కళ్ళమీద, నుదుటిమీద దోసకాయ ముక్కలను రోజూ పెట్టుకోవాలి. ఇలా పదిహేను రోజులు చేస్తే ముడతల సమస్య తగ్గుతుంది.

Related posts