telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

చెమట సమస్య.. ఇదిగో పరిష్కారం… !

tips to control over sweat in summer

రోజు రోజుకీ ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌వుతున్న‌ది. గ‌త కొద్ది రోజుల నుంచీ ఎండ‌లు మ‌రింత పెరిగాయి. దీంతో జ‌నం పిట్ట‌ల్లా రాలుతున్నారు. మ‌రో వైపు ఎండ‌లో తిరుగుతున్న చాలా మంది చ‌ల్ల‌గా ఉండ‌డం కోసం శీత‌ల పానీయాలు, ఇత‌ర మార్గాల‌ను అనురిస్తున్నారు. అయితే ఈ ఎండ‌ల్లో చాలా మందిని చెమ‌ట స‌మ‌స్య కూడా ఇబ్బంది పెడుతున్న‌ది. ఓ వైపు ఫ్యాన్ లేదా కూల‌ర్ తిరుగుతూ ఉన్న‌ప్ప‌టికీ చెమ‌ట బాగా ప‌డుతున్న‌ది. దీంతో ఏం చేయాలో తెలియ‌క చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే కింద సూచించిన చిట్కాలు పాటిస్తే.. ఎక్కువ‌గా విడుద‌ల‌య్యే చెమ‌ట నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే…

* ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు 2 టీస్పూన్ల వెనిగ‌ర్‌, 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను క‌లిపి తాగితే చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.

* నిత్యం ఏదైనా ఒక స‌మ‌యంలో 1 గ్లాస్ ట‌మాటా జ్యూస్‌ను తాగినా అధికంగా చెమ‌ట ప‌ట్ట‌కుండా చూసుకోవ‌చ్చు.

* గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.

tips to control over sweat in summer* కార్న్ స్టార్చ్‌, బేకింగ్ సోడాల‌ను కొద్ది కొద్దిగా తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దాన్ని చంక‌ల్లో రాయాలి. చంకల్లో ఎలాంటి త‌డి లేకుండా చూసుకుని ఆ మిశ్ర‌మాన్ని రాయాలి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.

* గోధుమ గ‌డ్డి జ్యూస్ తాగ‌డం లేదా పొటాషియం ఎక్కువ‌గా ఉండే అర‌టి పండ్లు తదిత‌ర ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌కుండా చూసుకోవ‌చ్చు.

Related posts