telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

నిత్య యవ్వనానికి.. చక్కటి ఆహారం.. ఇదే…

tips to be younger forever

నిత్యం యవ్వనంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అందరూ తగ్గట్టుగా ఇప్పటికే అనేక ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు కూడా. అయితే దీనికి భారతీయ పురాతన వైద్య శాస్త్రంగా చెపుతున్న ఆయుర్వేదంలో అనేక రహస్యాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా బయటకు తెలీకపోయినా కూడా, ప్రస్తుతం వివిధ ఆహారాలు తీసుకోని, నిత్యం యవ్వనంగా కనిపిస్తున్నవారి రహస్యాలు ఏమిటో తెలిసిపోయాయి. అవేమిటో చూద్దాం.. కొన్ని రకాల ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మీరు యంగ్ గా కనిపించవచ్చు. అక్షయ్ కుమార్ లా యాబ్స్, షారుఖ్ ఖాన్ లా సావీ, అమీర్ ఖాన్ లా ఎనర్జీ కలిగి ఉండాలంటే ఏజ్ పెరిగే కొద్దీ తినే ఆహారాల్లోనూ మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామాలు బాగా చేయాలి. తగినంత నిద్ర పోవాలి. అప్పుడప్పుడు నవ్వుతూ కూడా ఉండాలండోయ్. ఇవన్నీ చేస్తేనే ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం ఒత్తిడి వంటి నుంచి బయటపడగలరు. ఇక 40 ఏళ్లపడిలో పడిన పురుషులు తీసుకోవాల్సిన ఉత్తమమైన ఆహారాలు ఏమిటో ఒక్కసారి చూడండి మరి.

10. తృణధాన్యాలు :

^ తృణధాన్యాలు శరీరానికి చాలా పోషకాలను అందిస్తాయి. రోజూ తినే ఆహారంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్, వివిధ రకాల ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి.
^ రక్తంలో చక్కెర, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, బీపీని కంట్రోల్ లో ఉంచగల పవర్ హోల్ గ్రెయిన్స్ కు ఉంటుంది. అలాగే అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు తృణధాన్యాలను డైట్ లో చేర్చుకుంటే మేలు.
^ తృణధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది నెమ్మదిగా రక్తప్రవాహంలో గ్లూకోజ్ ను విడుదల చేయగలదు. దీంతో మధుమేహం బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తృణధాన్యాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో లాక్టిక్ ఆమ్లం అనే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది.
^ రోగనిరోధక శక్తి కోసం, రోజూ కనీసం మూడు సార్లు పెసలు, అలసందలు ఇలా రకరకాల విత్తనాలను 60 నుంచి 90 గ్రాముల వరకు తీసుకుంటే మేలు. మొలకెత్తిన విత్తానాలనుగానీ లేదంటే తృణధాన్యాలతో తయారు చేసి పదార్థానలుగానీ తినొచ్చు.

9. బీన్స్ :
^ బీన్స్ కూడా రోజూ తీసుకోవాలి. వీటిలో పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఫ్యాట్ ఉంటుంది. అలాగే ప్రోటీన్లు కూడా ఉంటాయి. బీన్స్ లేదా రాజ్మా మొక్కల్లో ప్రోటీన్ల అధికంగా ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో ఎనిమిది వరకు వీటిలో ఉంటాయి.
^ తృణధాన్యాల్లో ఉండే మెథియోనిన్ మాత్రం వీటిలో ఉండదు. ఇక తృణధాన్యాలతో పాటు బీన్స్ కూడా తీసుకుంటే బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి.
^ మధుమేహంతో పాటు హృదయ సంబంధింత వ్యాధుల బారినపడకుండా ఉంటారు. ఇందులో గ్లైసెమికల్ ఇండెక్స్ బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేయగలవు.
^ బీన్స్ లో ఉండే ప్రోటీన్లు చర్మం, జుట్టుకు కూడా మంచి శక్తిని ఇవ్వగలవు. అలాగే ఫోల్టేట్, మెగ్నీషియం, థియామిన్ ముఖ్యమైన పోషకాలుంటాయి. బీన్స్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
^ శక్తి స్థాయిలను పెంచుతాయి. జుట్టు తక్కువ వయస్సులో తెల్లపడడాన్ని ఆపగల శక్తి బీన్స్ కు ఉంటుంది. రక్తహీనత బారిన పడకుండా చేయగలదు. శరీరానికి కావాల్సినంత కాల్షియం, పొటాషియం బీన్స్ అందించగలవు.
^ హృదయానికి సంబంధించిన కండరాల పనితీరు బాగా ఉండేలా చేయగలవు బీన్స్. అలాగే మానసిక పనితీరు మెరుగుపడేలా చేయగలవు. వయస్సు పైబడ్డ ఛాయలు కనిపించకుండా చేసే శక్తి బీన్స్ కు ఉంటుంది.

8. వాల్ నట్స్ :
^ వీటిలో ఎక్కువగా నూనె ప్రొఫైల్, విటమిన్ -E, మెలటోనిన్ ఉంటుంది. అలాగే యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా అవసరం.
^ ఫ్రీ రాడికల్స్ వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేయగలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫామెంటరీ లక్షణాలు వాల్నట్స్ లో ఎక్కువగా ఉంటాయి.
^ దీనిలో ఉండే పిటోన్యూట్రియెంట్స్ అంటే క్వినోన్ జగ్లోన్, టానిన్ టెలీమాగ్రాంండిన్ లేదా ఫ్లేవానోల్ మోర్రిన్ వంటివి ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా చేయగలవు. అలాగే ఒమేగా -3 (ఆల్ఫా లానోలెనిక్ యాసిడ్) హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా చేయగలదు.
^ అధిక బరువును తగ్గించగల శక్తి కూడా వాల్నట్స్ కు ఉంటుంది. వాల్నట్స్ ను రోజూ తింటే ఇలాంటి చాలా ప్రయోజనాలున్నాయి. అందువల్ల రోజూ వీటిని తీసుకుంటే మంచిది.

7. గ్రీన్ టీ :
^ దీనిలో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడగలవు. గ్రీన్ టీలో కాటేచిన్ ఎక్కువగా ఉంటుంది.
^ దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే బీపీతో పాటు హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. బ్రిడ్జ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం గ్రీన్ టీ బీపీని అదుపులో ఉంచగలదని తేలింది. కొలెస్ట్రాల్ ను తగ్గించగల శక్తి కూడా గ్రీన్ టీ ఉందని అధ్యయనంలో తేలింది. అలాగే హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా చేయగలదు.
^ గ్రీన్ టీపై జపాన్ లో నిర్వహించిన కొన్ని అధ్యయనాల ప్రకారం జర్నల్ ఆఫ్ న్యూట్రీషన్ లో కొన్ని విషయాలు ప్రచురించారు. హృదయ సంబంధ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడగల శక్తి గ్రీన్ టీకి ఉందని ఈ అధ్యయనాల్లో తేలింది.
^ రోజూ తాగితే స్టమక్ రాకుండా ఎసోఫాజియల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. చైనాలో జరిపిన ఒక అధ్యయనం ప్రకరాం గ్రీన్ టీని తరచూ తాగే పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడడం లేదని తేలింది.

6. వంకాయ :
^ ఇవి తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే వంకాయలో ఉన్న ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా రోజూ వంకాయనే తింటారు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఫైటో ట్యూయురెంట్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవానాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.
^ ఫైబర్, నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. పలు రకాల వ్యాధుల బారిన పడకుండా వంకాయ మేలు చేస్తుంది. అలాగే త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగల శక్తి కూడా వంకాయకు ఉంటుంది. బాడీలో ఫ్రీరాడిక్సల్ లోటు ఏర్పడకుండా చూడగల గుణాలు వంకాయలో ఉంటాయి.
^ క్యాన్సర్ తో పోరాడటానికి సహాయం చే 13 రకాలు ఫిలోలిక్ ఆమ్లాలను వంకాయ శరీరానికి అందించగలదు. వంకాయలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ క్యాన్సర్ కణితి పెరుగుదల లేకుండా చేయగలదు.
^ యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్ లక్షణాలు ఎక్కువగా వంకాయలో ఉంటాయి. హృదయాన్ని రక్షించే సమ్మేళనాలు ఎక్కువగా వంకాయలో ఉంటాయి. వంకాయలో ఎక్కువగా నీరు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తి కూడా మెరగవుతుంది.

5. జామ :
^ విటమిన్ సి అత్యంత ఎక్కువగా జామలో ఉంటుంది. 100గ్రాముల జామలో 212 ఎంజీ విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచగలదు. అలాగే అంటురోగాల నుంచి రక్షిస్తుంది. విటమిన్ సి తో పాటు ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
^ లైకోపీన్ క్వెర్సెటటిన్, ఇతర పాలిఫినోలిక్ సమ్మేళనాలను జామ అందించగలదు. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటానికి జామ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులోని ఫోలేట్ సంతానోత్పత్తికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
^ జామలోని ఇతర పోషకాలు జీర్ణక్రియకు బాగా ఉపయోగపడతాయి. ఇందులోని మాంగనీస్ కూడా బాడీకి చాలా ఉపయోగపడుతుంది.
^ జామలోని పొటాషియం గుండె కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు. అలాగే బీపీని అదుపులో ఉంచగలదు. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచే గుణం కూడా జామకు ఉంటుంది. మధుమేహం, అధిక బరువును నియంత్రణలో ఉంచే శక్తి కూడా జామకు ఉంటుంది.

4. మూలికలు (హెర్బ్స్) :
^ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే గుణాలు మూలికల్లో ఎక్కువగా ఉంటాయి. మొరింగా, అశ్వగంధ, పవిత్ర బాసిల్, లిక్వో రైస్ రూట్స్, గిన్సెంగ్ వంటి మూలికలు ఒత్తిడిని దూరం చెయ్యగలవు. మీరూ రోజూ తినే ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని క్లినికల్ పరిశోధనల్లో తేలింది.
^ ఐబీస్, అధిక బీపీ, చర్మం పాలిపోవడం, జుట్టుఊడిపోవడం వంటి వాటి నుంచి రక్షించగల శక్తి కేవలం మూలికలకు మాత్రమే ఉంటుంది. పూర్వం మూలికలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు వాటి వాడకం తగ్గింది అయితే మరోసారి మీరు ఆరోగ్యానికి ఉపయోగపడే మూలికలను ఉపయోగించి చూడండి. మంచి ఫలితాలు పొందుతారు.

3. నూనెలు :
^ కొన్ని రకాల నూనెలు కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. ఆయిల్స్ వల్ల కొందరు కొలెస్ట్రాల్ పెరగుతుందని, హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతామని కొందరు ఆందోళన చెందుతుంటారు. అయితే మోతాదులో ఆయిల్స్ ఉపయోగిస్తే ఎలాంటి నష్టం ఉండదు. నూనెలు మనం తినే ఆహారం రుచిని పెంచుతాయి.
^ అలాగే ఆయిల్స్ లో A, D, E, K విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్యాటీ యాసిడ్స్ ను పెంచుతాయి. బాడీకి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, శక్తిని అందిస్తాయి. 20 నుంచి 25 శాతం వరకు రోజూ శరీరానికి కావాల్సిన కొవ్వు ఆయిల్స్ నుంచే వస్తూ ఉంటుంది.
^ ఏ ఆయిల్ ఎంచుకోవాలి? అనేది ప్రధాన సందేహంగా ఉంటుంది. మోనో సాచ్యురేటెడ్, సాచ్యురేటెడ్స్ ఉండేటటువంటి మంచి ఆయిల్ ఎంచుకోవాలి.
^ వేరుశనగల నూనె శరీరానికి చాలా మంచిది. దీన్ని ఆవాల నూనెతో కలిపి వాడితే కూడా బాగానే ఉంటుంది. అలాగే ఆలివ్ ఆయిల్ కూడా దాదాపు వేరుశెనగ నూనె మాదిరిగానే ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది. ఇలాంటి ఆరోగ్యవంతమైన నూనెలు శరీరానికి అవసరమైన పోషకాలను అందింగలవు. అలాగే ఎల్ డీఎల్, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచగలవ శక్తి ఈ ఆయిల్స్ కు ఉంటుంది.

2. పాలు :
^ పాలను కేవలం పిల్లల మాత్రమే తాగాలనుకోకండి. పాలలో నాణ్యమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కూడా అదికంగా ఉంటాయి. ఒక గ్లాస్ స్కిమ్ముడ్ పాలు 58 శాతం కేలరీలను అందివ్వగలవు. అలాగే 240 ఎంజీ కాల్షియం అందుతుంది. బీ12 విటమిన్ కూడా అందుతుంది. కాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యకరంగా బలంగా ఉంటాయి. అలాగే దంతాలు కూడా బలంగా ఉంటాయి.
^ ఒక జపనీస్ అధ్యయనం ప్రకారం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పత్రికలో 2008 లో ఒక ఆర్టికల్ ప్రచురించారు. ముఖ్యంగా పాల పదార్థాల నుంచి మాత్రమే బాడీకి కావాల్సిన కాల్షియం అందుతుంది. అలాగే వివిధ రకాల స్ట్రోక్స్ బారిన పడకుండా పాలు, పదార్థాలు కాపాడగలవు.
^ అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురించిన ఆర్టికల్ లో శరీరానికి అవసరమైన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అన్నీ కూడా పాలలోనే ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచగల శక్తి పాలకు ఉంటుంది

1. డార్క్ చాక్లెట్ :
^ కోకో పౌడర్ లో ఫ్లేవానాయిడ్స్ రక్తపోటును తగ్గించగలవు. అలాగే ఈ ఫ్లేవానాయిడ్స్ శరీరానికి కావాల్సిన నైట్రేట్స్ అందిస్తాయి. దీంతో రక్త నాళాల్లో రక్త ప్రవాహం ఒక క్రమంలో ఉంటుంది. ఫలితంగా అధిక రక్తపోటు అంటే బీపీకి గురికారు. అయితే డార్క్ చాక్లెట్స్ లో కెఫిన్ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోకపోవడం మంచిది.
^ డార్క్ చాక్లెట్స్ లలో ఉండే ఫ్లేవానాయిడ్స్ హృదయ ధమనుల్లో ఉండే అడ్డంకుల్ని నివారిస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారించగలవు. దాదాపు డార్క్ చాక్లెట్స్ లలో ఎక్కువగా కేలరీలు నిండి ఉంటాయి. అందువల్ల రోజూ ఒకటి లేదా రెండు చాక్లెట్స్ తింటూ ఉండండి.

Related posts