telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ విద్యా వార్తలు

ఏపీ .. గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ వచ్చేసింది..దరఖాస్తు ఇలా..

tips to apply ap grama volunteer

ఏపీలో గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ వచ్చేసింది, అయితే దానికి ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అందరికి ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది తెలియజేస్తున్నాము. ముందుగా అధికారిక వెబ్ సైట్ లో కి వెళ్ళండి. అనంతరం కింద చెప్పినట్టుగా చేయండి.

అధికారిక వెబ్ సైట్ : https://gramavolunteer.ap.gov.in/VVAPP/YUWeb/VVARegistration

* ముందుగా పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మేకు అర్హత ఉందొ లేదో తెలుసుకోండి.

* అర్హత ఉంటే మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేయండి.OTP వస్తుంది. OTP ఎంటర్ చేసాక VERIFY పై క్లిక్ చేయండి.

* తరువాత పేజి లో ఫోటో మరియు రెసిడెన్స్ ప్రూఫ్ ( RATION CARD/ VOTER CARD/ RESIDENCE CERTIFICATE/ BANK PASS BOOK ఏదో ఒకటి) అప్లోడ్ చేయాలి.

* తరువాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ అర్హత ని బట్టి పదవ, ఇంటర్ , డిగ్రీ డీటెయిల్స్ తో పాటుగా వీటిని అప్లోడ్ కూడా చేయాలి.

* తరువాత మీ యొక్క కులము ఎంటర్ చేయాలి. OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి VERIFY చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.

* చివరగా APPLY పై క్లిక్ చేయండి. మీకు ఒక నెంబర్ DISPLAY అవుతుంది.

Related posts