telugu navyamedia
ఆరోగ్యం

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

ఆధునిక యుగంలో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా లేదా, ఆహారపు అలవాట్లు వల్ల చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జుట్టుకు సంబంధించిన పలు సమస్యలు తలెత్తుతున్నాయి. వాతావరణ కాలుష్యం కూడా జుట్టు ఊడిపోవడానికి ఓ కారణం. మంచి ఆహారం జుట్టును ఆరోగ్యవంతంగా మార్చుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు కణాలలో కెరోటిన్ ప్రొటీన్ ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యకరంగా చూస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా ఉంటాయి.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, చేపలు, సొయా, పాలు, పప్పు, గింజలు తదితర ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. ఐరన్, జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం జుట్టును దృఢంగా ఉంచుతుంది. జింక్ లోపంతో జుట్టు త్వరగా రాలిపోతుంది. గుమ్మడి గింజలు, వేరుశనగ, నువ్వులు తదితర పదార్థాల్లో జింక్ శాతం ఎక్కువ. వీటిని ప్రయత్నించండి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలను ఎంచుకోండి. విటమిన్లు ఏ, ఇ, బి, డీ లతో పాటు బయోటిన్ మీ జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. జుట్టును మెరిసేలా చేసే మెలనిన్ ఉత్పాదకతను పెంచేందుకు బి విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి.

*జుట్టుకి గోరింటాకు పెట్టడం వల్ల త్వరగా తెల్లబడదు. కరివేపాకు ఆకులను తీసుకొని 2 స్పూన్ల ఆమ్లా పౌడర్, 2 టీస్పూన్ల బ్రాహ్మీ ఫౌడర్‌తో కలిపి రుబ్బాలి. దీన్ని హెయిర్ మాస్క్‌గా జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట పాటు అలాగే ఉంచి తేలికపాటి మూలికా షాంపూతో శుభ్రం చేయండి.

*కొబ్బరి నూనె, నిమ్మరసం జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి. ఈ రెండింటి కలయిక ఒక రసాయన ప్రతిచర్యకు కారణమవుతుంది. ఇది కొంత కాలానికి జుట్టును సహజంగా నల్లగా చేస్తుంది. బ్లాక్ టీ ఆకులను 2 గంటల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి. నిమ్మరసంతో మిక్స్ చేసి జుట్టును శుభ్రం చేయడానికి ముందు 40 నిమిషాల పాటు హెయిర్ మాస్క్ లాగా అప్లై చేయండి. ఇది జుట్టు నల్లగా ఉండటానికి ఎంతో మేలు చేస్తుంది.

* ఒక స్పూన్ మెంతి పొడి, ఒక స్పూన్ కుంకుడుకాయ పొడి, ఒక స్పూన్ పుల్లటి పెరుగు.. కలిపి గంటసేపు నానబెట్టాలి. దీన్నితలకు ప్యాక్‌లా వేసి 45 నిమిషాలు వుంచి గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఇది తలలోని చుండ్రుని షాంపూలకంటే మెరుగ్గా నిర్మూలిస్తుంది.

 

Related posts