telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

చుండ్రుకి .. ఇలా చెక్…

tips for dandruff and its solutions

చుండ్రు, ఇది అందరికి ఒక ప్రధాన సమస్య. ఈ సమస్యతో ఒక నాటికి ఉన్న జుట్టు కూడా పోయే పరిస్థితి రావచ్చు కూడా. అలాంటివి జరిగేదాకా ఆగకుండా, దీనిని రూపుమాపే విధానాలు ఏమితో తెలుసుకొని, పాటిస్తే సరిపోతుంది. ఇక ఇది ఉంటె మనకు ఎదురయ్యే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తలలో దురద రావడం, దానితో గట్టిగ గోకినా లేదా దువ్వుకున్నా తీవ్రంగా జుట్టు రాలిపోవడం జారుతుంటాయి. అలాగే భుజాలపై, ధరించిన దుస్తులపై తెల్లగా డస్ట్ పడి, చిరాకుగా అనిపిస్తుంది. దీనికోసం అందరూ ఎన్నో చిట్కాలు పాటించి, విసిగిపోయి ఉంటారు. అయితే ఇక్కడ చెపుతున్నవి ఒకసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. దానితో ఈ సమస్య నుండి శాశ్వతంగా బయటపడవచ్చు.

1. గోరువెచ్చని నీటిలో కొన్ని వేపాకులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వేపాకులను తీసేసి ఆ నీటిని తలకు రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

2. యాపిల్ సిడర్ వెనిగర్‌లో కొంచెం నీరు చేర్చి బాగా కలుపాలి. షాంపూకి బదులుగా ఈ మిశ్రమాన్ని తలకు వాడాలి. దీనిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలోని క్రిములను తొలిగిస్తుంది. తరచూ ఇలా చేస్తే చుండ్రు తొలిగి దురద తగ్గుతుంది.

3. గోరింటాకు పొడిలో చక్కెర, ఆలివ్ నూనె, నిమ్మరసం, కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూతలా పట్టించాలి. 45 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే తలంతా శుభ్రంగా ఉంటుంది.

4. వేడి నీటిలో గులాబీ ఆకులను బాగా మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు బాధ తగ్గుతుంది.

5. జుట్టుకు పోషణ అవసరం. అది అందాలంటే మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు వంటి పానీయాలను రోజుకు రెండుసాైర్లెనా తీసుకోవాలి.

Related posts