telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భారత్ లో టిక్ టాక్ ఉద్యోగులకు అండగా ఉంటాం: సీఈఓ

tik tok

ఇటీవల సరిహద్దుల్లో ఇండియా, చైనా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణ 21 మంది భారత సైనికులను బలి తీసుకున్న నేపథ్యంలో మొత్తం 59 చైనా యాప్ లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. చైనా కేంద్రంగా నడుస్తున్న టిక్ టాక్ సంస్థ యాప్ ను భారత్ లో నిషేధించిన నేపథ్యంలో సంస్థ సీఈఓ కెవిన్ మేయర్ ఇక్కడి ఉద్యోగులకు అండగా ఉంటామని ఓ లేఖ రాశారు.

టిక్ టాక్ లో ఇంటర్నెట్ ను ప్రజాస్వామ్యబద్ధం చేయాలన్న లక్ష్యంతో మాత్రమే మనం పని చేశామన్నారు. ఇండియాలోని చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలను అన్నీ పాటిస్తూనే ఉన్నామని తెలిపారు. మన యూజర్ల సంఖ్యను 20 కోట్లకు చేర్చేందుకు ఎంతో శ్రమించామని తెలిపారు.

మన ఉద్యోగులే సంస్థకు బలం. వారి బాగోగులు సంస్థకు ప్రాధాన్యం. ఇక్కడ ఉన్న 2 వేల మంది ఉద్యోగుల మేలు కోసం అన్ని చర్యలూ తీసుకుంటాం” అంటూ ‘ఏ మెసేజ్ టూ అవర్ ఎంప్లాయిస్ ఇన్ ఇండియా’ అన్న టైటిల్ తో ఆయన లేఖ రాశారు. ఇప్పుడు ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని లేఖలో తెలిపారు. ఈ విషయంలో అందరు వాటాదారులతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు.

Related posts