telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోకు కాకుండా ఆయన తల్లికి బొకే పంపించిన హీరోయిన్… కారణం…!

Disha

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ‘మలంగ్’ సినిమా రిలీజ్ అయింది. ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా మంచి టాక్ అందుకుంది. కాగా ఈ బ్యూటీ హీరో టైగర్ ష్రాఫ్ డేటింగ్‌లో ఉన్నారని చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల దిశా, టైగర్ కలిసి బయట కనిపించడం తగ్గిపోయింది. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా దిశా ఓ ప్లాన్ వేసారు. టైగర్‌కు పువ్వులు పంపిస్తే ఏమనుకుంటాడో ఏమోనని అతని తల్లి ఆయేషా ష్రాఫ్‌కు గులాబీల బొకేను పంపించారు. ఈ విషయాన్ని ఆయేషా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘దిశా పటానీ నుంచి క్యూట్ వ్యాలెంటైన్ గిఫ్ట్ వచ్చింది’ అని పేర్కొంటూ బొకే ఫొటోలను పోస్ట్ చేసారు. ఇందుకు దిశా స్పందిస్తూ.. ‘లవ్యూ ఆంటీ’ అని కామెంట్ చేసారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Related posts