telugu navyamedia
telugu cinema news

దిశాను అభిమానుల నుంచి కాపాడిన టైగర్

Disha-Patani-and-Tiger-Shroff

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ, స్టార్ హీరో టైగర్ ష్రాప్ కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఇటీవలే ముంబైలోని బస్టియన్ రెస్టారెంట్‌కు వెళ్లింది. అయితే దిశా పటానీ రెస్టారెంట్ బయటకు రాగా… ఆ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో రెస్టారెంట్ వద్దకు వచ్చారు. అభిమానులంతా ఒక్కసారిగా దిశాపటానీ దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న టైగర్ తన బాడీగార్డ్స్‌తో అక్కడికి వచ్చి, రద్దీగా ఉన్న అభిమానుల నుంచి దిశాపటానీని కాపాడి సురక్షితంగా కారులో ఎక్కించాడు. టైగర్, దిశా తరచుగా ముంబైలోని బస్టియన్ రెస్టారెంట్‌కు వెళ్తుంటారు. ఇటీవలే దిశా పటానీ తన పుట్టినరోజు వేడుకలను టైగర్‌తో కలిసి ఇదే రెస్టారెంట్ వద్ద అభిమానుల సమక్షంలో జరుపుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Related posts

:ఆర్.ఆర్.ఆర్. : .. ఎప్పుడూ ఎన్టీఆర్ గురించేనా .. రామ్ చరణ్ విశేషాలు చెప్పారా..

vimala p

బిగ్ బాస్ 3 తెలుగు : .. పునర్నవి ఎలిమినేట్ కావడంతో .. కళతప్పిన హౌస్..

vimala p

బిగ్ బాస్-3 : అలీ రెజా రీఎంట్రీ ఖాయమైనట్టేనా ?

vimala p