• Home
  • వార్తలు
  • విశాఖలో 15న వెస్టిండిస్‌తో జరగనున్న రెండో డే అండ్‌ నైట్‌ వన్డేకు టికెట్ల విక్రయం
క్రీడలు వార్తలు వార్తలు

విశాఖలో 15న వెస్టిండిస్‌తో జరగనున్న రెండో డే అండ్‌ నైట్‌ వన్డేకు టికెట్ల విక్రయం

india-vs-west-indies-vadodara-stadium-tickets-of-2nd-odi-match-24-october-2018-640x300

వెస్టిండిస్‌తో జరగనున్న రెండో డే అండ్‌ నైట్‌ వన్డేకు టికెట్ల విక్రయం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. విశాఖలోని పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనె 24న ఈ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. స్టేడియం సామర్థ్యం 28 వేలు కాగా, ఇందులో 90 శాతం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహక కమిటీ చైర్మన్‌, పోర్టు ట్రస్టు చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు విలేకరులకు తెలిపారు.

ఈవెంట్స్‌ నౌ డాట్‌ కామ్‌ ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాన్ని చేపట్టనుంది. దీంతో పాటు విశాఖలోని పది కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. టికెట్ల కొనుగోలుకు ఎటువంటి ఆధార్‌ లింక్‌ అవసరం లేదన్నారు. 250, 500, 750, 1200, 1800, 2 వేల రూపాయ డినామినేషన్ల టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో బాక్స్‌ టికెట్‌ను 2500 రూపాయలకు విక్రయించగా ఈసారి దీని ధరను రూ.500 తగ్గించి రూ.2 వేలు చేశారు.  కాగా, ఈ నెల 22వ తేదీన ఇరు జట్ల క్రీడాకారులు విశాఖకు చేరుకుంటారు. 23వ తేదీన నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తారు. 24వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

Related posts

భారత్ ఖాతాలో మరో బంగారం…

admin

భారత్ లో విదేశీయురాలికి జరిగిన అవమానం తట్టుకోలేక…

nagaraj chanti

మహాకూటమి వస్తే..అమరావతి వద్ద మోకరిల్లే పరిస్థితి: హరీష్‌ రావు

madhu

Leave a Comment