telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

దసరా వచ్చేస్తొందయ్యా … రైళ్లు ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నాయి..

ticket booking rush on dasara started again

దసరా అనగానే సెలవులు ఎలా గుర్తుకువస్తాయో.. వాళ్ళవాళ్ళ ఇళ్లకు, ఊళ్లకు ప్రయాణం చేసేందుకు టికెట్ బుకింగ్ కూడా అంతే గుర్తుకు వస్తుంది. ఎప్పటి లాగానే ఈసారి అప్పుడే బుకింగ్ ల హడావుడి ప్రారంభం అయ్యింది. దసరా నవరాత్రులు స్టార్ట్ కావడానికి మూడు వారాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నారు. ముందుగానే రైళ్లు, బస్సులలో టికెట్లు బుక్ చేసుకొనేందుకు రెడీ అవుతున్నారు. ప్రధానంగా రైళ్లను చాలామంది ఆశ్రయిస్తుంటారు. కానీ..అప్పటికే సీట్లు ఫుల్ అయ్యాయని తెలుస్తోంది. సెలవులు అయిపోయి తిరిగి వెళ్లే రోజులైన అక్టోబరు 8, 9 తేదీల్లోనూ టిక్కెట్‌లన్ని బుకింగ్ అయిపొయినట్లు, కొన్ని రైళ్లలో అయితే వెయిటింగ్‌ లిస్టు 100కి దాటేసిందని సమాచారం.

దసరా నవరాత్రులు సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆలోపు స్కూల్ పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో దసరా పెద్ద పండుగగా చేసుకుంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పండుగను వైభవంగా నిర్వహిస్తుంటుంది. స్వస్థలాల్లో పండుగను నిర్వహించుకోవాలని సెలవులు పెట్టి వెళుతుంటారు. రైళ్లలో ప్రయాణం సేఫ్‌తో పాటు హాయిగా జర్నీ చేయవచ్చని అనుకుంటుంటారు. చాలా మంది అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసేసుకున్నారు. పండగకి సీట్లు దొరుకుతాయో, లేదోనన్న మీమాంసలో ఉన్నవారు మాత్రం తత్కాల్‌ కోటా టిక్కెట్‌లు, ప్రత్యేక రైళ్ల పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకొంటున్నారు.

Related posts