telugu navyamedia
వార్తలు సామాజిక

రైల్వే స్టేషన్స్ లో టికెట్స్ బుకింగ్ కౌంటర్లు!

Train Indian railway

జూన్ 1 నుంచి రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ప్రయాణాలు అందుబాటులో ఉంటాయి. కేవలం 200 రైళ్లు మాత్రమే నడవబోతున్నాయి. అవి నాన్ ఏసీ రైళ్లు మాత్రమే నడవబోతున్నాయి. దీనికి సంబంధించిన రిజర్వేషన్ టికెట్స్ ఈరోజు నుంచి టికెట్స్ కౌంటర్లు లో ఇస్తున్నారు.

అయితే, గతంలో మాదిరిగా అన్ని రైల్వే స్టేషన్స్ లో టికెట్స్ కౌంటర్లు అందుబాటులో లేవు. ప్రభుత్వం నిర్ణయించిన కౌంటర్లలో మాత్రమే టికెట్స్ అందుబాటులో ఉంటాయి. తెలంగాణలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో మొత్తం 73 రైల్వే స్టేషన్లలో టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. దీని ప్రకారం తెలంగాణలో 18, ఏపీలో 43, మహారాష్ట్రలో 6, కర్ణాటకలో 5 స్టేషన్లలో టికెట్స్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Related posts