telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు రాజధానులు రాష్ట్రపతి ఆర్డర్ కు వ్యతిరేకం: తులసిరెడ్డి

Tulasireddy

మూడు రాజధానుల బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇల్లు అలకగానే పండుగ కాదు అనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.మూడు రాజధానులు రాష్ట్రపతి ఆర్డర్ కు వ్యతిరేకమని తులసిరెడ్డి అన్నారు.

గవర్నర్ సంతకం చేస్తే చట్టం అవుతుందని… కానీ, ఆ చట్టాలు హైకోర్టులో నిలబడవని చెప్పారు.ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ కు పంపిందని, దానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారనివాటన్నింటినీ కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. మూడు రాజధానుల విషయంలో కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పారు.

 

Related posts