telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హ్యాకింగ్ ద్వారా ఈవీఎం టాంపరింగ్.. ఇదే 2014లో బీజేపీ విజయ రహస్యమా…రిలయన్స్ హస్తం.. అందుకే రాఫెల్ కట్టబెట్టారా..

2014లో బీజేపీ విజయాలపై వార్తలు భగ్గుమంటున్నాయి. అసలు బీజేపీ విజయం వెనుక చీకటి రహస్యాలు ఉన్నాయంటూ ఇప్పుడు నిజాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికలలో రిగ్గింగ్ తో పాటుగా ఈవీఎం హాకింగ్ చేయడం ద్వారా బీజేపీ లాభపడిందని తెలుస్తుంది. మోడీ మొదటి నుండి టెక్నాలజీ అంటుంటే, దానివెనుక ఇదా రహస్యం.. టెక్ ను దుర్వినియోగపరిచడం ఎంత తీవ్రంగా చేయవచ్చో .. ఇది ఒక స్పష్టమైన ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈ నేరానికి బీజేపీ పార్టీ నాయకులందరికీ ఏ శిక్ష విధించాలి, అది ఎప్పటికి పడుతుంది, ఎప్పటికి అమలు అవుతుంది. టెక్నాలజీతో గెలిచి, గెలిచినట్టు ఇన్నాళ్లు దేశాన్ని పాలించి, ప్రజలను హింసించి రాక్షస ఆనందాన్ని పొందిన ఒకరకమైన మానసిక రోగుల సమూహమే బీజేపీనా.. ఈ ప్రశ్నలన్నీ ప్రస్తుతం 2014 ఎన్నికల గురించి వస్తున్నా వార్తల వలన ప్రజలలో వస్తున్నవి. వీటికి సమాధానం ఎక్కడ, ఎవరు ఇస్తారు!

through haking evm tamparing said shuja

ఇక 2014లో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు అవసరమైన లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను పొందేందుకు బీజేపీకి టెలికామ్ దిగ్గజ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సాయపడిందని సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చెప్పారు. డేటాను ట్రాన్స్ మిట్ చేసేందుకు అవసరమైన దేశవ్యాప్త నెట్ వర్క్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కి ఉందని.. దాని ద్వారా బీజేపీ లాభపడిందని ఆయన అన్నారు. భారత్ లో రిలయన్స్ కు 9 ప్రాంతాలలో డేటా నెట్ వర్క్ పంపిణీ చేసే కేంద్రాలు ఉన్నాయని షుజా వివరించారు. ఈవీఎంలు హ్యాక్ చేసే ఉద్యోగులకు కూడా తాము ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నట్టు తెలియదని.. వాళ్లు కేవలం డేటా ఎంట్రీ పని చేస్తున్నట్టు అనుకుంటారని షుజా ఆరోపించారు. అయితే షుజా ఇప్పుడు ఈ నిజాలు ఎందుకు బయటపెడుతున్నారు. ఆయన వెనుక ఎవరు ఉన్నారు. బీజేపీ వ్యతిరేకత నుండి వచ్చిన శత్రువుల సమూహం ఆతని వెంట ఉండి ..ఈ నిజాలు కక్కిస్తుందా.. చెప్పిస్తుందా.. !!

Related posts