telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదల… మూడు థియేటర్లు సీజ్

Lakshmi's-NTR

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా విడుదలను ఏపీలో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్నికల కారణంగా సినిమా విడుదలను నిలిపివేశారు. దీంతో మే 1న కొన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేసి వర్మ తన పంతం నెగ్గించుకున్నారు. ఈ నేపథ్యంలో కడపలో “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను ప్రదర్శించిన మూడు సినిమా థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదలకు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు లేనప్పటికీ కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్, రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు థియేటర్ యజమానులను హెచ్చరించి వదిలేశారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది సిఫారసు చేశారు. దీంతో అప్రమత్తమైన జేసీ కోటేశ్వరరావు థియేటర్లపై చర్యలకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో సినిమా ప్రదర్శించిన మూడు థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related posts