telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఒంటిపై నూలు పోగు లేకుండా చేసి దాడి…!?

Sadists

ఉన్మాదుల్లా మారిన టీనేజర్లు బాధిత బాలుడికి యూకేలోని వెస్ట్ మిడ్లాండ్స్‌లో గల హైగేట్‌లో గతేడాది సెప్టెంబర్‌లో కూల్‌డ్రింక్ కింద పారబోశాడనే కారణంతో ముగ్గురు టీనేజర్స్ ఓ స్కూల్ బాలుడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే… స్నేహితులైన కీలె ఆస్టన్, క్రిస్టోఫర్ ప్యాట్ పీర్స్ , లూసీ ప్యాట్ పీర్స్ (యువతి) పిలవడంతో బాధిత బాలుడు వారి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అతడికి ఇచ్చిన కూల్‌డ్రింక్‌లో కొంచెం ఇంట్లోని నేలపై పడింది. దాంతో కోపంతో ఉగిపోయిన ఆ ముగ్గురు బాలుడిపై దాష్టీకానికి దిగారు. మొదట ఆస్టన్ దాన్ని నోటితో శుభ్రం చేయాలని బాలుడిని ఆదేశించాడు. దానికి బాలుడు ఒప్పుకొకపోవడంతో అతడి తలపై వేడిగా నూడిల్స్‌ను పారబోశాడు ఆస్టన్. అనంతరం ఆ ముగ్గురు తోబుట్టువులు బాలుడిని ఇష్టానుసారంగా కొట్టారు. ఆ తరువాత బాలుడి ఒంటిపై నూలు పోగు లేకుండా చేసి మొదట కత్తితో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా బాలుడి జననాంగాలను లైటర్‌తో కాల్చారు. బాధతో బాలుడు విలవిలలాడుతుంటే అది చూసి ఆ ముగ్గురు రాక్షసానందం పొందారు. దీన్నంతటిని లూసీ ప్యాట్ పీర్స్ వీడియో కూడా తీసింది. వారి నుంచి ఎలాగొలా తప్పించుకుని బాలుడు ఇంటికి చేరుకున్నాడు. అయితే, బాలుడి ముఖంపై, ఒంటిపై తీవ్రమైన గాయాలు చూసిన తల్లిదండ్రులు ఏం జరిగిందని అడిగారు. మొదట భయంతో కొందరు దుండుగులు తనను కొట్టి దోచుకెళ్లారని అబద్ధం చెప్పిన బాలుడు ఆ తరువాత అసలు ఏం జరిగిందో వివరించాడు. దాంతో పోలీసులను ఆశ్రయించారు బాధిత బాలుడి పేరెంట్స్. వారి ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు నిందితులను పోలీసులు గతేడాది అక్టోబర్‌లో అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బర్మింగ్‌హామ్ న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు వచ్చింది. వాదనలు విన్న కోర్టు ఆస్టన్‌కు 8 ఏళ్లు, లూసీకి నాలుగేళ్లు, క్రిస్టోఫర్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Related posts