three swine flew cases recorded in hyderabad said doctors

మరో సారి స్వైన్ ఫ్లూ కలకలం…ఈ నెలలోనే నగరంలో ముగ్గురు…

హైదరాబాద్ నగరంలో మరో సారి స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఒక్క ఈ నెల లోనే మూడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు తేలింది. తాజాగా ఓ మహిళ ఆనారోగ్యంతో ఆసుపత్రికి రాగా వచ్చిన కొద్దీ సేపటికే మృతి చెందింది. రక్త పరీక్షలు చేసిన వైద్యులు స్వైన్ ఫ్లూ గా అనుమానిస్తున్నారు.

స్థానిక ఎల్.బి.నగర్ మూసారాంబాగ్ కు చెందిన ఆజీదాభాను అనారోగ్య కారణంగా 25న రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేరింది. చేరిన కొద్దీ సేపటికే చికిత్స పొందుతూ మృతి చెందింది అని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నెలలో మూడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు వైద్యులు తెలిపారు. గతంలో స్వైన్ ఫ్లూ నగరాన్ని వణికించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *