telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముగ్గురు భామలతో నాని రొమాన్స్ ?

Vijay Shyam Singa Rai

నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత నాని వరుసగా సినిమాలు చేసేందుకు సైన్ చేశారు. ఇప్పటికే ‘టక్ జగదీష్’ అనే చిత్రం లైన్‌లో పెట్టిన నాని, రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగరాయ్’ అనే టైటిల్‌ కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. లేదంటే ఇప్పటికే సెట్స్‌పై ఉండేది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ల గురించి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. నాని మూడు వైవిధ్య కోణాల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. ఈ ముగ్గురి కోసం ఇప్పటికే ఆరుగురిని సెలక్ట్ చేశారని, అందులో నుంచి ముగ్గురుని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని టాక్. రష్మిక మందన్నా, రాశీ ఖన్నా, సాయిపల్లవి, నివేథా ధామస్, నిధి అగర్వాల్, రీతూ వర్మల పేర్లు ఈ చిత్రం కోసం సెలక్ట్ చేసుకున్నారని, ఇందులో ముగ్గురిని ఫైనల్ చేయనున్నారని అంటున్నారు. మరి నాని సరసన నటించే ఆ ముగ్గురు ఎవరో అతి త్వరలోనే తెలియనుంది.

Related posts