telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్

thota vani ycp

మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి తోట వాణి పై టీడీపీ అభ్యర్థి చినరాజప్ప 4 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే చినరాజప్ప ఎన్నికల అఫిడవిట్‌లో ఆదాయ వనరులతో పాటు క్రిమినల్ కేసులను దాచిపెట్టి తప్పుడు డిక్షరేషన్ ఇచ్చారని పేర్కొంటూ వాణి హైకోర్టులో అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ, 2007లో ఓబులాపురం మైనింగ్ కార్యాలయంపై దాడి కేసులో చినరాజప్ప 15వ ముద్దాయిగా ఉన్నారని పేర్కొన్నారు.

ఆ కేసు క్లోజ్ చేయమని రెండుసార్లు ప్రభుత్వ జీవోలు విడుదల చేయించి కోర్టుకు పంపించారని ఆమె పేర్కొన్నారు. అయితే కోర్టు వాటిని తిరస్కరించి ఇప్పటికీ వారెంట్‌ను కొనసాగిస్తోందని వాణి తెలిపారు. కానీ అఫిడవిట్ దీని ప్రస్తావనే లేదన్నారు. ఎమ్మెల్సీ పెన్షన్ అన్నిటినీ దాచిపెట్టి కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే ఆదాయం వస్తున్నట్టు చినరాజప్ప ప్రకటించారని ఆరోపించారు. ఈ వ్యవహారం పై హైకోర్టు చినరాజప్పపై ఆరు నెలల్లో అనర్హత వేటు వేస్తుందని వాణి పేర్కొన్నారు.

Related posts