రాజకీయ వార్తలు

కోమటిరెడ్డి , సంపత్ నిరాహార దీక్ష

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో నిన్నగవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించే క్రమంలో నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్ సెట్ ను విసరడం, అది కాస్త శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌ కంటికి తగలడం జరిగింది. వెంటనే స్వామి గౌడ్ ని సరోజినీ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లడం, చికిత్స చేయించడం అన్ని వెనువెంటనే జరిగిపోయాయి. 
 
అయితే ఈ రోజు శాసన సభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. 11 మంది ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ చేయడమే కాకుండా,  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ల శాసన సభ్యత్వాలను కూడా రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. తెరాస ప్రభుత్వం, కేసీఆర్ యొక్క నిరంకుశానికి, దుర్మార్గానికి  ప్రతీక అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  సస్పెండ్ అయిన ఆ 11 మంది ఎమ్మెల్యేలు రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ప్రకటించారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు 48 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఇదిలా ఉండగా నల్గొండ, అలంపూర్ నియోజక వర్గాలనుండి కాంగ్రెస్ కార్యకర్తలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు మద్దతుగా దీక్షలో పాల్గొనడానికి  భారీ సంఖ్యలో  హైదరాబాదుకు పయనమైనట్లు సమాచారం 

Related posts

పొత్తు పెట్టుకుంటే తెలంగాణ జాతి క్షమించదు

madhu

ప్రగతి నివేదన సభతో కేసీఆర్‌ ఆట ముగిసింది: డీ కే అరుణ

madhu

27న డెడ్ లైన్…

admin

Leave a Comment