రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

ప్రజల కోసం జీవితం అంకితం… ఆ ఇద్దరు వైద్యులు..త్వరలో…

those two doctors ready for elections

వైద్యో నారాయణో హరిః అన్నారు… హస్తవాసి బాగుంది అని కొందరు అంటూ ఉంటారు… ఇలాంటి వాటితో సహజంగా వైద్యులనే సంబోధిస్తారు. అటువంటి వైద్య వృత్తిలో ప్రజలకు తమ సేవలు అందిస్తూ.. ఇంకా ఏదైనా చేయాలనే తపనతో ఇద్దరు వైద్యులు రాజకీయాలలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అలాగని రాజకీయనాయకులు అయ్యాక వైద్యం మానేస్తారా అంటే.. కుదరదట… అది అదే, ఇది ఇదే.. అంటున్నారు. అంటే ప్రజల పట్ల వారికి ఉన్న ప్రేమాభిమానాలు, అలాగే ప్రజాసేవ చేయాలనే వారి తపన తెలుస్తుంది.

ఇంతకి ఈ వైద్యులు ఎవరు అంటే, ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండల కేంద్రానికి చెందిన డా.రవి కిరణ్ యాదవ్, డా. వన్నెల అశోక్. వీరిద్దరూ ప్రాంతీయంగా వైద్యసేవలో ఎంతో పేరుప్రతిష్టలు తెచ్చుకున్నారు. అలాగే స్వచ్చంద కార్యక్రమాలు కూడా చేసి ప్రజలకు ఇంకా దగ్గర అయ్యారు. వీరు ఇక రాజకీయ రంగంలో ఉంటె ఇంకెంత సేవ చేయగలరో.. అంటూ మొత్తానికి వీరి రాజకీయ రంగప్రవేశం ఖాయమైంది. ఆదిలాబాద్ నుండి ఒకరు, బోధ్ నుండి ఒకరు పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నారు. అయితే ఏ పార్టీ తరుపున చేస్తారు అనేది స్పష్టత లేదు. ఏది ఏమైనా సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతో వస్తున్న వారు కాబట్టి స్వాగతించడం శ్రేయస్కరం. వీరి నిర్ణయాన్ని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు రాజకీయాలలోకి రావటం కొత్తేమి కాదు. దివంగత నేత రాజశేఖరరెడ్డి కూడా వైద్యులే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఆ పేరు తెలుసు కాబట్టి ఏదో ఒక పేరు ప్రస్తావించడం జరిగిందంతే. 

Related posts

ముఖ్యమంత్రిపై ప్రేమతో.. విఘ్నేష్ తో పెళ్లొద్దంటున్ననయనతార..!?

nagaraj chanti

టీటీడీకి కొత్త పాలక మండలి… 

admin

రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు : బాబు

admin

Leave a Comment