telugu navyamedia
సినిమా వార్తలు

గుణ 369 : ఫస్ట్ సాంగ్ “తొలి పరిచయమా ఇది…” లిరికల్ వీడియో

Guna-369

తాజాగా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ నటిస్తున్న చిత్రం “గుణ 369”. ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న అన‌గ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ఇక చిత్ర టీజ‌ర్‌ని జూన్ 17న విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ర‌స్టిక్ ల‌వ్ స్టోరీగా ఉండ‌నున్న ఈ చిత్రం తప్పకుండడా ప్రేక్షకులను ఆకట్టుకుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం. అర్జున్‌ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి సాంగ్ “తొలి పరిచయమా ఇది…” లిరికల్ వీడియో సాంగ్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాట యూత్ కు కనెక్ట్ అవుతుంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts