• Home
  • వార్తలు
  • ఇ-కామర్స్ వ్యాపారం..ఈసారి 300 కోట్ల డాలర్లు..
Trending Today వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సమీక్ష వార్తలు సాంకేతిక సామాజిక

ఇ-కామర్స్ వ్యాపారం..ఈసారి 300 కోట్ల డాలర్లు..

this season e-commerce will do 300 crores business

భారతీయ పండుగల సందర్భంగా ఇ-కామర్స్ ద్వారా అమ్మకాల విలువ ఈ సారి భారీగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్, గ్యాడ్జెట్, దుస్తులు, పర్సనల్, హెల్త్ కేర్, ఫ్యాషన్, ఫర్నిచర్, స్మార్ట్ ఉత్పత్తులకు బాగా డిమాండ్ ఉందని వాళ్ళు చెపుతున్నారు. పండగ సీజన్ రెండు మూడు నెలలోనే వ్యాపారం బాగా సాగుతుందని, అది దృష్టిలో పెట్టుకొనే ఆయా సంస్థలు భారీ డిస్కౌంట్లు కూడా ప్రకటించాయని అన్నారు. వ్యాపార అభివృద్ధి కోసం ఆయా సంస్థలు చిన్న చిన్న గ్రామాలకు కూడా వారి వారి ఉత్పత్తులను వినియోగదారులకు డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే పట్టణాలలో ఇ-కామర్స్ అవగాహన ఉంది, ఇక ఇప్పుడిప్పుడే గ్రామాలలో కూడా ఈ తరహా కొనుగోళ్లు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెపుతున్నారు.

ఇక ఇ-కామర్స్ వలన ఆయా వ్యాపార సంస్థల వృద్ధితో పాటు స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కూడా అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇ-కామర్స్ ద్వారా వారి ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకోవచ్చు. పండగ సీజన్ లో డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని అమెజాన్ 50 వేల మందిని, ఫ్లిప్ కార్ట్ 30 వేల మందిని సప్లై చెయిన్ కార్యకలాపాలలో పని చేసేందుకు నియమించుకున్నాయి. ఇతర ఇ-కామర్స్ సంస్థలు కూడా భారీగానే సిబ్బందిని నియమించుకున్నాయి. వీరు తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తుంటారు. ఇక పండుగల సందర్భంగా షాపింగ్ అంతా కూడా క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపు చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టారు, తద్వారా తక్షణ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ సదుపాయాలు ఉంటాయి. ఆయా సంస్థలు ఈ సీజన్ కోసం సెలెబ్రిటీలతో ప్రచారం కూడా ముమ్మరంగానే చేస్తాయి.

Related posts

తెలంగాణాలో మంజీరా కుంభమేళా

admin

16ఏళ్ల విద్యార్థితో 40ఏళ్ల ఉపాధ్యాయురాలి కలిసి జంప్

nagaraj chanti

“హ్యారీపొటర్” సినిమాలో యువరాజ్ సింగ్ భార్య

vimala t

Leave a Comment