telugu navyamedia
సినిమా వార్తలు

సాహో : సంగీత దర్శకులు ఎందుకు హర్ట్ అయ్యారంటే…?

Saaho

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం “సాహో”. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. దాదాపు 300 కోట్ల రూపాయ‌ల భారీ బడ్జెట్‌తో హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందుతుంది. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి వంటి అగ్ర తార‌లు న‌టిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయనున్నారు చిత్రబృందం. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా “సాహో” నుంచి తప్పుకున్నట్టు సంగీత త్రయం శంకర్‌ – ఎహసాన్‌ – లాయ్‌ ప్రకటించారు.

ఇప్పుడు వారు తప్పుకోవడానికి గల కారణాలను శంకర్ మీడియా ద్వారా వెల్లడించారు. “సాహో” సినిమాకు సంగీతంతో పాటు నేపధ్య సంగీతం కూడా అందించాలనుకున్నామని, కానీ నిర్మాణ సంస్థ దానికి వేరొకరిని నియమించుకుందని అన్నారు. కనీసం పాటల వరకైనా తమనే తీసుకొని ఉంటే బాగుండేదని, సినిమాకు తామే సంగీత దర్శకులుగా ఉండాలని అనుకున్నట్లు, అందుకే సినిమా నుండి తప్పుకున్నట్లు చెప్పారు. ఈ మధ్య ఒక సినిమాకు ఎందరో సంగీత దర్శకుడు కలిసి పని చేస్తున్నారని, ఇదే విషయం నిర్మాణ సంస్థ తమతో చర్చించిందని కానీ అది మాకు ఇష్టం లేదని అన్నారు. సినిమాలో బయట కంపోజర్ల నుండి మరిన్ని పాటలు యాడ్ చేయాలని చిత్రబృందం భావిస్తోందని ఈ విషయం తమకు అసౌకర్యాన్ని కలిగించినట్లు చెప్పారు.

Related posts