telugu navyamedia
వార్తలు సామాజిక

పిల్లల కోసం ఈ గే జంట ఏం చేశారో చూడండి

This-Gay-married-couple-wanted-to-have-a-child

ఈ ఆధునిక యుగంలో మనుషుల ఆలోచనల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు మగవారు పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇద్దరూ ఒకే లింగస్థులు అయితే పిల్లలు కావాలన్న వారి కోరిక కొంచం కష్టతరంగా మారుతోంది. దీంతో పిల్లల్ని కనేందుకు వారు వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా అమెరికాలో ఓ గే జంట ఓ మహిళ ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఎవరో ఒక మహిళ ద్వారా అయితే అందులో వింతేమి లేదు. కానీ వీళ్ళు సొంత కుటుంబసభ్యుల ద్వారానే ఆడపిల్లకు జన్మనివ్వడం వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని ఒమాహకు చెందిన మ్యాథ్యూ ఎలెడ్జ్, ఇలియట్ డౌగెర్టీ అనే గే జంటకు పిల్లలు కావాలనుకున్నారు. సరోగసి ద్వారా ప్రయత్నించాలనే ఆలోచన వచ్చినా వారికి ఎందుకో నచ్చలేదు. దీంతో అసలు అద్దె గర్భంతోనే ఎందుకు కనాలి ? కుటుంబసభ్యుల ద్వారా జన్మనిస్తే అనే ఆలోచన వచ్చింది వారికి. ఇదే విషయాన్ని ఎలెడ్జ్ తన తల్లికి, ఇలియట్ తన సోదరికి చెప్పడంతో వారు కూడా దీనికి ఒప్పుకున్నారు. దీంతో ఎలెడ్జ్ వీర్యం, ఇలియట్ సోదరి ఎగ్స్‌ను ఎలెడ్జ్ తల్లి గర్భాశయంలో ప్రవేశపెట్టారు. దీంతో ఎలెడ్జ్ తల్లి గర్భం దాల్చింది. తొమ్మిది నెలల తరువాత గత సోమవారం ఉదయం ఎలెడ్జ్ తల్లి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తమకు పాప పుట్టిందని ఎలెడ్జ్, తన భర్త ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌ చూసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related posts